ఎస్బీఐ కి వెళ్లి ఈ ఖాతాని ఓపెన్ చేస్తే ఎన్నో లాభాలు పొందొచ్చు…!

Join Our Community
follow manalokam on social media

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే దేశీ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కస్టమర్లకు వివిధ రకాల సర్వీసులని ఇస్తోంది. అయితే వీటిల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF అకౌంట్ సర్వీసులు కూడా ఒకటి అని చెప్పొచ్చు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్న దీనిని బ్యాంకుల నుండి కానీ పోస్టాఫీస్‌ల నుండి కానీ ఎకౌంట్ ని తెరవొచ్చు. దీని వలన మంచి బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు.

 

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వలన లాభాలు కలుగుతాయి. మీరు బ్యాంక్‌కు వెళ్లి ఈ అకౌంట్ తెరిస్తే.. చాలా బెనిఫిట్స్ పొందొచ్చు. మెచ్యూరిటీ సమయంలో మంచి రాబడి వస్తుంది. మీరు ఎస్‌బీఐ‌ లో పీపీఎఫ్ ఖాతా తెరవాలని భావిస్తే.. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాలి. అయితే ఈ ఖాతాని ఎవరైనా ఓపెన్ చెయ్యచ్చు. ఎటువంటి రూల్స్ లేవు. మీరు సులభంగానే ఈ ఖాతా తెరవొచ్చు.

ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ప్రస్తుతం పీపీఎఫ్‌పై 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. సంవత్సరానికి రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతూ రావొచ్చు లేదా అలానే ఉండవచ్చు. పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు.

ఇది ఇలా ఉండగా పెట్టే డబ్బులపై పూర్తి పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి. పిల్లల పేరుపై కూడా పీపీఎఫ్ ఖాతాని ఓపెన్ చెయ్యవచ్చు. మీరు ఇందులో కనుక నెలకు రూ.1,000 డిపాజట్ చేస్తే మెచ్యూరిటీ కాలంలో మీ చేతికి రూ.3 లక్షలకు పైగా లభిస్తాయి. ఒకవేళ ఇందులో నెలకు రూ.3 వేలు పెడితే దాదాపు రూ.10 లక్షలు వస్తాయి. అదే నెలకు రూ.10 వేలు పెడితే చేతికి ఏకంగా రూ.32 లక్షలు వస్తాయి.

TOP STORIES

శ్రీరామ నవమి : రాముడి కంటే రామనామమే శక్తివంతమా?

శ్రీరాముడి కంటే ఆయన నామానికే ఎక్కువ శక్తి వుందని పలువురి భక్తుల విశ్వాసం. రామనామాన్ని ఎవరు జపిస్తారో వారికి అన్ని జయాలే అని విశ్వాసం. రామాయణంలో...