వాటే ఆఫర్.. కారు కొంటే రూ.లక్ష తగ్గింపు…!

-

మీరు కారుని కొనాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇప్పుడు కారుని కొనుగోలు చేయాలంటే అదిరే ఆఫర్స్ వున్నాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఓలా కార్స్ తాజాగా కొనుగోలుదారుల కోసం భారీ తగ్గింపు అందిస్తోంది. కనుక కారు కొనాలని భావించే వారికి ఇదే సరైన సమయం. ప్రి-ఓన్డ్ కార్ ఫెస్టివల్ ప్రకటించింది.

ఇందులో భాగంగా భారీ తగ్గింపుని కారు కొనాలని అనుకునే వారు పొందొచ్చు. అలానే ఆఫర్ వుంది కనుక మీ డబ్బులు ఆదా అవుతాయి. ఇక ఆఫర్ వివరాల లోకి వెళితే.. ఓలా కార్ ఫెస్టివల్‌ లో భాగంగా దాదాపు 2 వేల కార్ల పై ఆఫర్స్ ని పొందొచ్చు. అయితే ఈ అఫర్ లో భాగంగా రూ.లక్ష వరకు తగ్గింపు వస్తోంది.

అదే కాకుండా 2 ఏళ్ల వరకు ఉచిత సర్వీస్ బెనిఫిట్ ని కూడా వినియోగదారులు పొందొచ్చు. అలానే 12 నెలల వారంటీ కూడా వస్తుంది. అంతే కాక కారు కొనుగోలు చేసిన వారికి 7 రోజుల రిటర్న్ పాలసీ కూడా ఉంది. కారు తీసుకోవాలని అనుకునే వారు ఓలా యాప్ నుండి మీకు నచ్చిన కారుని కొనచ్చు.

ఇక మీరు కనుక స్టేట్ బ్యాంక్ SBI నుంచి లోన్ తీసుకుంటే వడ్డీ రేటులో 0.5 శాతం తగ్గింపు లభిస్తోంది. అలాగే రుణాలపై జీరో ప్రాసెసింగ్ ఫీజు లాభాన్ని కూడా మీరు పొందొచ్చు. మీరు ఈ లాభాలని ఎస్‌బీఐ యోనో ద్వారా కారు బుక్ చేసుకుంటేనే అవుతుంది. లేదు అంటే ఈ ప్రయోజనాన్ని పొందలేరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version