పాన్ కార్డ్ ఇప్పుడు అందరికి అవసరమైన ఒక గుర్తింపు. మనిషికి ఆధార్ కార్డ్, పాన్ కార్డు తప్పనిసరిగా ఉండే గుర్తింపుకార్డులు. ఆధార్ నంబర్ లో అన్నీ అంకెలు ఉంటాయి. కానీ పాన్ కార్డులో కొన్ని అంకెలు,లెటర్స్ కూడా ఉంటాయి కదా. ఈ సంఖ్యలు, లెటర్స్ ఎందుకు ఉంటాయో తెలుసా. అయితే ఈ స్టోరీపై లుక్కేయండి..!
పాన్ నెంబర్ కంప్యూటర్ మీద జెనరేట్ చేసింది కాదు. ఈ నెంబర్ లో ప్రతి అంకెకు, అక్షరానికి వెనక ఒక అర్ధం ఉంటుంది. మొదటి మూడు సంఖ్యలు AAA – ZZZ సిరీస్లో లో ఉంటాయి. ఆ తరువాత వచ్చే నాలుగో ప్లేస్ లో ఉండే అక్షరం వెనక అర్ధం మీ గురించే చెప్తుంది..అదేలా అంటారా
P – ఈ అక్షరం ఉంటే సదరు వ్యక్తి వ్యక్తిగత పన్ను చెల్లించేవారని అర్ధం.
C – ఈ అక్షరం ఉంటే కంపెనీ అని అర్ధం.
B – ఈ అక్షరం ఉంటే వ్యక్తుల బృందం(బిఓఐ) కు చెందినది అని అర్ధం.
G – ఈ అక్షరం ఉంటే ప్రభుత్వ ఏజెన్సీకి చెందినది అని అర్ధం.
J – ఈ అక్షరం ఉంటే తాత్కాలిక న్యాయవ్యవస్థకు చెందినది అని అర్ధం.
L – ఈ అక్షరం ఉంటే స్థానిక అధికారిక కేంద్రానికి చెందినది అని అర్ధం.
F – ఈ అక్షరం ఉంటే సంస్థ లేదా పరిమిత భాగస్వామ్య సంస్థకు చెందినది అని అర్ధం.
T – ఈ అక్షరం ఉంటే ఏదైనా ట్రస్ట్ కు చెందిన వారు అని అర్ధం.
H – ఈ అక్షరం ఉంటే హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) కు చెందిన అవారని అర్ధం.
A – ఈ అక్షరం ఉంటే వ్యక్తులు లేదా సంస్థల బృందం(అసోసియేషన్ పర్సన్స్-ఏఓపి) అని అర్ధం వస్తుంది.
ఇక ఐదవ అక్షరానికి వచ్చేసరికి సదరు వ్యక్తి ఇంటిపేరులోని మొదటి అక్షరం ఉంటుంది. ఒకవేళ వ్యక్తులు కాకుండా ఇతరమైనవి ఐతే.. ఆ పాన్ కార్డు ఎవరికీ ఇస్తున్నారో.. ఆ హోల్డర్ పేరులోని మొదటి అక్షరాన్ని ఐదవ స్థానంలో పెడతారు. ఆ తరువాత నాలుగు సంఖ్యలను పొందుపరుస్తారు. ఈ నాలుగు సంఖ్యలు 0001 నుంచి 9999 మధ్యలో ఏవైనా కావచ్చు. అలాగే చివరి స్థానం మాత్రం A నుంచి Z వరకూ ఏదో ఒకటి ఉంటుంది. ఇది పాన్ నంబర్ జారీచేసేప్పుడు కంప్యూటర్ జనరేట్ చేస్తుంది. ఇలా 10డిజిట్స్ ఆల్ఫాన్యూమరిక్ నంబర్ తో పాన్ కార్డు వస్తుంది.. ఇలా పది స్థానాలు ఎందుకు ఉంటాయో తెలిస్తే.. పాన్ నెంబర్ ను ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. ఒకసారి మీ పాన్ నంబర్ చెక్క్ చేసుకోండి..చాలా ఆసక్తిగా ఉందికదూ..!