లైఫ్‌ ఇన్సూరెన్స్‌, సేవింగ్‌ స్కీమ్‌ లలో ఏది బెస్ట్ తెలుసా?

-

ఈరోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా కష్టం.. అందుకే మొదటి నుంచి కొంత పెట్టుబడి పెడుతున్నారు.. అయితే ఎందులో పెట్టుబడి పెట్టాలి అనే ఆలోచనతో ఉంటారు.. లైఫ్‌ ఇన్సూరెన్స్‌, సేవింగ్‌ స్కీమ్‌ ఈ రెండింటిలో ఎందులో పెట్టుబడి పెట్టాలో తెలియక అయోమయానికి గురవుతారు.. ఇన్సూరెన్స్‌ కింద ఏదైన వ్యక్తికి అనుకోకుండా ఘటన జరిగితే కొంత మొత్తం డబ్బు అందుతుంది. కుటుంబంలో సంపాదించే సభ్యుడు మరణించిన సందర్భంలో మిగిలిన సభ్యులకు సహాయం చేస్తారు. నామినీకి ప్రయోజనాలు ఉన్నప్పటికీ జీవిత బీమా పాలసీ పొదుపుకు మంచిది కాదని చాలా మంది అంటారు..

 

జీవిత భీమా కింద భీమా తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు పూర్తి భరోసా ఇస్తామని హామీ ఇస్తారు.పొదుపు పథకాలలో వచ్చిన మొత్తం వడ్డీతో చెల్లిస్తారు. జీవిత బీమా పాలసీలో ఒక వ్యక్తి బీమాను మాత్రమే పొందుతాడు. కానీ ఒక వ్యక్తి పొదుపు పథకంలో భారీ మొత్తాన్ని పొందుతాడు. కుటుంబ సభ్యులు ఈ డబ్బులని వివిధ మార్కెట్ మాధ్యమాలలో పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశం..

జీవిత భీమాలో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టొచ్చు. అదే పొదుపు పథకం ప్రీమియం కొంత ఖరీదైనది. టర్మ్‌ పాలసీలో మెచ్యూరిటీ ప్రయోజనం ఉండదు. అయితే పొదుపు పథకంలో పెట్టుబడిదారుడు మెచ్యూరిటీ ప్రయోజనాన్ని పొందుతాడు. అయితే జీవిత బీమా పథకాలు,పొదుపు పథకాలు రెండూ డబ్బును పెట్టుబడి పెట్టడానికి మంచి ఎంపికలు. మీకు దగ్గరలో భవిష్యత్తులో ఆర్థిక అవసరం ఉన్నప్పుడు, లేదా మీరు లేనప్పుడు కుటుంబాన్ని కవర్ చేసే ప్రత్యక్ష బీమా ప్లాన్ అవసరమైతే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు..ఇక మీ చాయిస్ మీకు ఏది బెస్ట్ అనుకుంటే అది చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version