పీఎం కిసాన్ స్కీమ్ ( PM Kisan Scheme ) ని ప్రధాని మోదీ రైతుల కోసం తీసుకు రావడం జరిగింది. ఈ స్కీమ్ లో భాగంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.6 వేలు అందిస్తోంది. చాల మంది రైతులు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ని పొందుతున్నారు. అర్హత కలిగిన రైతులకు ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల రూపంలో బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతూ వస్తాయన్న సంగతి తెలిసిందే.
అంటే రూ.2 వేల చొప్పున రైతులకు పీఎం కిసాన్ డబ్బులు అందుతున్నాయి. ఆధార్ లింక్డ్ ఎలక్ట్రానిక్ డేటా బేస్ ద్వారా ఈ స్కీమ్ ని అమలు చేస్తున్నారు. అయితే ఎవరిదీ పొలం వంటి వివరాలు కేంద్రం వద్ద ఉంటాయి. మోసం చేయడానికి అస్సలు కుదరదు. 5 ఎకరాలలోపు వ్యవసాయ భూమి కలిగిన వారికి మాత్రమే తొలిగా ఈ స్కీమ్‌ను వర్తింపజేశారు.
అయితే మీరు కూడా ఈ స్కీమ్ లో చేరాలని అనుకుంటున్నారా..? అయితే తప్పక ఈ డాక్యుమెంట్స్ కావాలి. వాటి వివరాల లోకి వెళితే.. పక్కా ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్, మొబైల్ నెంబర్, పేరు, కేటగిరి, జెండర్ వివరాలు అవసరం అవుతాయి. అదే విధంగా పొలం పట్టా బుక్ కూడా కావాలి. ఈ డాక్యుమెంట్లు ఉంటే ఆన్‌లైన్‌లోనే పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరిపోవచ్చు. ఇది ఇలా ఉంటే 2019 జూన్ నుంచి పథకాన్ని రైతులు అందరికీ అందుబాటులో ఉంచారు. ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు తొలి విడత డబ్బులు వచ్చాయి. నెక్స్ట్ ఆగస్ట్ 1 నుంచి నవంబర్ 30 వరకు రెండో విడత వచ్చాయి. డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు మూడవ విడత డబ్బులు ఇస్తారు.