“సలార్‌” నుంచి బిగ్‌ అప్డేట్‌…జగపతిబాబు లుక్‌ రిలీజ్‌

-

కేజీఎఫ్ సినిమాతో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్న ప్రశాంత్ నీల్, తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సలార్ పేరుతో ఈ సినిమా షూటింగ్‌ కూడా జరుపు కుంటోంది. ఇక ఇందులో హీరోయిన్ శృతి హాసన్.. ప్రభాస్‌ సరసన నటిస్తోంది. కేజీఎఫ్‌ కి పది రెట్లు మించి సలార్‌ ఉంటుందని ప్రశాంత్‌ నీల్‌ అనౌన్స్‌ చేసినప్పటి నుంచి.. అందరిలోనూ అంచనాలు భారీ గా పెరిగాయి.

ఇది ఇలా ఉండగా.. తాజాగా సలార్‌ సినిమా నుంచి తాజాగా బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా లో రాజమన్నార్‌ అనే పాత్ర ను సలార్‌ చిత్ర బృందం విడుదల చేసింది. రాజమన్నార్‌ పాత్రలో టాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ జగపతి బాబు నటిస్తున్నట్లు రివీల్ చేసింది సలార్‌ టీం. ఇక రాజమన్నార్‌ గెటప్‌ లో జగపతి బాబు చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. నోట్లో చుట్ట పెట్టుకుని ఎప్పుడూ.. కోపంగా కనిపిస్తున్నాడు జగపతి బాబు. ఇక ఈ సినిమాలో జగపతి బాబు విలన్‌ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.  ఈ లుక్‌ చూస్తే… అందరూ భయపడేల్సిందే అన్నట్లుగా లుక్‌ ఉంది. కాగా.. ప్రస్తుతం ఈ సలార్‌ చిత్ర షూటింగ్‌ దశలో ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version