ఎంప్లాయిస్ పీఎఫ్ అకౌంట్ కి సంబంధించి ఈపీఎఫ్‌వో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మార్పు పీఎఎఫ్ హోల్డర్స్ అందరికీ కూడా అప్లై అవుతుంది.ఇక మీరు కూడా పీఎఫ్ హోల్డర్ అయితే కనుక కచ్చితంగా ఈ రూల్స్ తెలుసుకోవాలి. PF అకౌంట్ లోని వివరాలను సరిచేయడానికి ఇంకా అప్డేట్ చెయ్యడానికి ఈపీఎఫ్‌వో కొన్ని కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది.
పేరు, పుట్టిన తేదీ వంటి పర్సనల్ డీటెయిల్స్ ని అప్డేట్ చెయ్యడానికి కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) మార్గదర్శకాన్ని జారీ చేసింది. హోల్డర్స్ ప్రొఫైల్‌లను అప్డేట్ చెయ్యడానికి ఎస్ఓపీ వెర్షన్ 3.0 అనేది ఆమోదించబడింది. ఇప్పుడు ఈ కొత్త రూల్ తర్వాత, యూఏఎన్ ప్రొఫైల్‌లో అప్‌డేట్ డాక్యుమెంట్స్ అందించాలి. ఈ డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌వో తన మార్గదర్శకాల్లో చాలా తప్పులనేవి జరుగుతుంటాయని, వాటిని సరిదిద్దుకునేందుకు బాగా ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలిపింది. డేటా అప్‌డేట్ కాకపోవడం వల్ల ఈ ప్రాబ్లెమ్ ఏర్పడిందని తెలిపింది.
కొత్త రూల్స్ ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే.. రెండు కేటగిరీలలో మార్పులు ఉంటాయి. ఈపీఎఫ్‌వో ప్రొఫైల్‌లోని మార్పులను పెద్ద, చిన్న గ్రూపులుగా డివైడ్ చెయ్యాలి. చిన్న మార్పులు జాయింట్ డిక్లరేషన్ అభ్యర్థనతో పాటు కనీసం రెండు అవసరమైన డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. పెద్ద మార్పుల కోసం కనీసం మూడు అవసరమైన డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చెయ్యాలి. అయితే ఇందులో మాత్రం ఎటువంటి ఎలాంటి తప్పులు జరగకుండా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంప్లాయిస్ ప్రొఫైల్స్‌ను అప్‌డేట్ చేయడంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆధార్ సంబంధిత మార్పుల విషయంలో మొబైల్ నంబర్‌కు లింక్ చేయబడిన ఆధార్ కార్డ్ లేదా ఇ-ఆధార్ కార్డ్ సపోర్టింగ్ డాక్యుమెంట్‌గా సరిపోతుంది.