మీరు ఆన్లైన్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే ఇక నుండి గూగుల్ పే లో కూడా ఎఫ్డీ చేసుకోవచ్చు. త్వరలో ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను చేసుకునేందుకు గూగుల్ పే అవకాశం కల్పించనున్నది. భాగస్వామి ఫిన్‌టెక్ ద్వారా ఈ సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు రానుంది. దీనితో కస్టమర్స్ గూగుల్ పే నుండి ఎఫ్డీ చెయ్యడానికి అవుతుంది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే..
మీరు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో పొదుపు ఖాతా లేక పోయినా Google Pay ద్వారా ఈక్విటాస్ FD ని బుక్ చేసుకోవచ్చు. మీ ప్రస్తుత ఖాతా నుండి డబ్బు ఉపసంహరించబడుతుంది ఇక వడ్డీ వివరాల లోకి వెళితే.. 7-29 రోజులు, 30-45 రోజులు, 46-90 రోజులు, 91-180 రోజులు, 181-364 రోజులు , 365 రోజులు ఇవ్వబడుతుంది. తక్కువ రోజులకి 3.5 శాతం వడ్డీ, 1 సంవత్సరం అయితే 6.35 శాతం వడ్డీ ఇస్తారు.