నిన్నటితో పోలిస్తే ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. రెండురోజుల క్రితం భారీస్థాయిలో పతనమైన వెండి ధరలు తిరిగి అదేస్థాయిలో పైకెగాశాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 40 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో పది గ్రాముల ధర 40,370 రూపాయలకు దిగింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరకూడా 40 రూపాయలు తగ్గింది. దీంతో 37,010 రూపాయలైంది. ఇక వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పైకెగాశాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 48,750 రూపాయలకు ఎగబాకింది.
ఢిల్లీ మార్కెట్ లో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 50 రూపాయలు తగ్గి 39,000 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 50 రూపాయలు తగ్గి 37,800 రూపాయల వద్దకు దిగింది. ఇక వెండి ధర ఇక్కడా భారీగా పెరిగింది. దీంతో ఢిల్లీలో వెండి ధర కేజీకి 48,750 రూపాయలకు చేరింది. ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 05.11.2019 మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు.