బంగారం కొనాలని అనుకునే వాళ్ళకి రిలీఫ్. బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. నాలుగు రోజుల నుండి కూడా ధరలు అలానే వున్నాయి. కానీ వెండి రేటు మాత్రం పెరిగింది. బంగారం ధరలకు సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
మంగళవారం బంగారం ధరలు నిలకడగానే వున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో మార్పు లేదు. దీంతో రేటు రూ.49,750 వద్దనే ఉంది. అదే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర చూస్తే రూ.45,600 వద్ద నిలకడగా ఉంది.
ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి ప్రభావం బంగారం మీద పడుతుంది అన్న విషయం అందరికీ తెలిసినదే.
ఇది ఇలా ఉండగా మరో వైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. 0.36 శాతం తగ్గింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1877 డాలర్లకు క్షీణించింది. అదే వెండి కోసం చూస్తే.. వెండి రేటు కూడా పడిపోయింది. ఔన్స్‌కు 0.54 శాతం తగ్గుదలతో 27.75 డాలర్లకు దిగొచ్చింది.