కరోనా దెబ్బకు భారీగా పడిపోయిన పసిడి ధరలు ..!

-

ప్రపంచం ఇప్పుడు కరోనా వైరస్ తీవ్రతతో ఎంతో ఇబ్బంది పడుతుంది. ఊహించని విధంగా వ్యాపిస్తుంది ఈ ప్రమాదకర వైరస్. ఇన్నాళ్ళు ఒక్క చైనా కు మాత్రమే పరిమితం అయిన ఈ మహమ్మారి ఇప్పుడు ఆ దేశం దాటి గల్ఫ్ దేశాలకు వెళ్ళింది. దీనితో ప్రపంచం అంతరించిపోతుందా దీని దెబ్బకు అంటూ పలువురు ఆందోళనలో ఉన్నారు. ఇటలీతో పాటుగా ఇరాన్, సౌదీ వంటి దేశాలకు వెళ్ళింది ఈ వ్యాధి.

చైనాలో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 80 వేలకు పైగా ఉందని అక్కడి మీడియాతో పాటుగా ఇంటర్నేషనల్ మీడియా కూడా చెప్తుంది. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ లు కరోనా దెబ్బకు పడిపోయాయి. ఈ ప్రభావం బంగారం ధర మీద గట్టిగా పడింది. సంస్థలు బంగారాన్ని అమ్మి ఈక్విటీ నష్టాలు పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న పసిడి నేడు మరింతగా తగ్గిపోయింది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి అనేది చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 290 వరకు తగ్గడంతో రూ.40,710కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే రూ. 290 వరకు తగ్గింది. దీంతో ఈ ధర రూ. 44,410కి చేరింది. వెండి విషయానికి వస్తే కిలో వెండి ధర రూ. 1930 తగ్గి షాక్ కి గురి చేసింది. దీంతో ఈ ధర రూ. 49,570కి పడిపోయింది. ఈ ధరలు ఇంకా తగ్గుతాయి అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news