గుడ్ న్యూస్.. కెనరా బ్యాంక్ నుంచి కొత్తగా మూడు లోన్ స్కీమ్స్..!

-

మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని రుణం తీసుకోవాలనుకునే వారి కోసం మూడు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. దీని కింద వ్యక్తులకు హెల్త్​ కేర్​ క్రెడిట్, బిజినెస్​ లోన్​, పర్సనల్​ లోన్​లను అందిస్తుంది. అయితే ఈ స్కీమ్స్ ద్వారా రూ. 25 వేలు, గరిష్టంగా రూ.50 కోట్ల వరకు తక్కువ వడ్డీరేట్లకే రుణాలిచ్చేందుకు ముందుకొచ్చింది. ఇక ఈ స్కీమ్స్ గురించి పూర్తి వివరాలలోకి వెళితే..

canara bank

హెల్త్‌కేర్ క్రెడిట్ లోన్:

గుర్తింపు పొందిన ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లు, మెడికల్ ప్రాక్టీషనర్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, పాథాలజీ ల్యాబ్‌లు, హెల్త్ కేర్ సర్వీసింగ్​ సెంటర్లను స్టార్ట్ చెయ్యడానికి ఇది బాగుంటుంది. ఈ పథకం కింద రూ. 10 లక్షల నుంచి రూ.50 కోట్ల వరకు రుణ సదుపాయం పొందవచ్చు. ఇది ఇలా ఉంటే 18 నెలల వరకు మారిటోరియం కూడా వర్తిస్తుంది. 2022 మార్చి 31 వరకు ఈ లోన్​ అందుబాటులో ఉంటుంది అని బ్యాంక్ తెలిపింది.

సురక్ష పర్సనల్​ లోన్​:

ఈ లోన్​పై రూ. 25 వేల నుంచి 5 లక్షల వరకు తక్షణ రుణ సదుపాయం పొందవచ్చు. అయితే కరోనా చికిత్సకు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అయ్యే ఖర్చులకు వాడచ్చు. ఈ లోన్లకు 6 నెలల మారిటోరియం వర్తిస్తుంది. ప్రాసెసింగ్​ ఫీజు ఉండదు. ఈ ఏడాది సెప్టెంబర్​ 30 వరకే ఈ పథకం అందుబాటులో ఉంటుంది.

బిజినెస్​ లోన్​:

ఇక బిజినెస్ లోన్ గురించి చూస్తే.. రూ.2 కోట్ల వరకు రాయితీ వడ్డీ రేట్లకే రుణాలు అందిస్తుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్​లకు మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లు మొదలైన వాటి కోసం లోన్ ఇస్తారు. పైగా ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. నాన్​ ఎంఎస్​ఎంఈలకు మాత్రం 25 శాతం హామీ ఇవ్వాల్సిందే. 2022 మార్చి31 వరకు ఈ లోన్ అందుబాటులో ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version