అన్నదాతలకు శుభవార్త.. ఇక నుండి ఈ సేవలు మరెంత సులభం..!

-

అన్నదాతలకు ఆదాయాన్ని పెంచాలని కేంద్రం ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తోంది. రైతుల కోసం అందుకే వివిధ రకాల స్కీమ్స్ ని కూడా కేంద్రం తీసుకు రావడం జరిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా అన్నదాతల కోసం సూపర్ యాప్‌ను లాంచ్ చేయబోతుంది కేంద్రం. మరి ఇక ఆ సూపర్ యాప్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే..

కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారులు అన్నదాతల కోసం సూపర్ యాప్ ని తీసుకొచ్చినట్టు చెప్పారు. అయితే ఈ యాప్ వలన లాభం ఏమిటి అనేది చూస్తే.. వ్యవసాయంలో వస్తోన్న పరిశోధనలు, అభివృద్ధికి సంబంధించిన సమాచారం ఈ యాప్ ద్వారా రైతులు తెలుసుకోచ్చు. అలానే వాతావరణానికి సంబంధించిన వివరాలను కూడా చూడచ్చు.

మార్కెట్లలో పంట ఉత్పత్తుల రేట్లు, అందుబాటులో ఉన్న సర్వీసులు, ప్రభుత్వం స్కీమ్‌లు మొదలైన వాటిని ఈ యాప్ ద్వారా ప్రభుత్వం అందించనుంది. అలానే ఇప్పటికే రైతులకు అందుబాటులో ఉన్న సువిధా, పుష కృషి, ఎంకిసాన్, ఫార్మ్-ఓ-పిడియా వంటి యాప్ లను కూడా ఈ సూపర్ యాప్‌లోనే అందించాలని కేంద్రం అనుకుంటోంది. దీనితో రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ యాప్‌లను అగ్రిగేట్ చేయడం ద్వారా రైతులు తమకు కావాల్సిన యాప్‌ను సెర్చ్ చేసే ప్రాసెస్ ని ఈజీ చెయ్యనున్నారు. వచ్చే కొన్ని వారాలలో ఈ యాప్‌ను లాంచ్ చేయనున్నట్టు అధికారులు చెప్పారు. పంటల ఉత్పత్తి, వాటి సంబంధిత సాంకేతికతలపై ఈ యాప్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇక్రా సంస్థలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన్ కేంద్రాలు, ఇతర విభాగాలు రూపొందించిన యాప్‌లను కూడా ఈ సూపర్ యాప్‌ లో ఇంటిగ్రేట్ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version