ట్రైన్ టికెట్ బుక్ చేసిన వారికి గుడ్ న్యూస్…!

-

కరోనా వైరస్ నేపధ్యంలో దేశంలో అన్ని ప్రాంతాల్లో ఈ నెల 31 రైలు సర్వీసులను ఇండియన్ రైల్వే రద్దు చేసింది. కరోనా తీవ్రతను కట్టడి చేయడానికి గాను అన్ని విధాలుగా రైల్వే శాఖ తన సహకారం అందిస్తుంది. రైల్లో ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉన్న నేపధ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. దీనితో ముందుగానే ట్రైన్ టికెట్ బుక్ చేసిన వారి పరిస్థితి ఏంటీ అనేది అర్ధం కావడం లేదు.

వాళ్లకు వాళ్ళే రద్దు చేసారు కాబట్టి టికెట్ క్యాన్సిల్ అయి రిఫండ్ వస్తుంది అని అంటున్నారు. కొందరు అయితే వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఈ నేపధ్యంలో టికెట్ బుక్ చేసిన వారికి భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఐఆర్‌సీటీసీ దీనిపై క్లారిటీ ఇచ్చేసింది. మీరు క్యాన్సిల్ చెయ్యాల్సిన అవసరం లేదని చెప్పింది. ఆటోమెటిక్‌గా టికెట్లు క్యాన్సిల్ అవుతయని, రీఫండ్ కూడా ఆటోమెటిక్‌గా ప్రాసెస్ అవుతుందని చెప్పింది.

రీఫండ్ రాకపోతే ఐఆర్‌సీటీసీ అధికారిక ప్లాట్‌ఫామ్‌లో కంప్లైంట్ చేయొచ్చు. ఇక పీఆర్ఎస్ కౌంటర్‌లో టికెట్లు కొనుగోలు చేసిన వారికి కూడా గుడ్ న్యూస్ చెప్పారు. టికెట్లు క్యాన్సిల్ చేయాలన్న హడావుడిలో ప్రయాణికులు రైల్వే కౌంటర్లకు రావొద్దని, కొత్త నిబంధనల ప్రకారం మార్చి 21 నుంచి జూన్ 21 మధ్య భారతీయ రైల్వే రద్దు చేసిన రైళ్లకు ప్రయాణ తేదీ నుంచి మూడు నెలల లోపు రీఫండ్ తీసుకోవచ్చని స్పష్టంగా చెప్పింది. సోషల్ డిస్టెన్స్ మైంటైన్ చెయ్యాలని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news