మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ ప్రసిద్ధి గాంచిన శ్రీకాళహస్తి, కోటప్పకొండ, శ్రీశైలం, చెరువుగట్టు, కీసరగుట్ట, వేములవాడ, వరంగల్ వేయి స్థంబాల గుడితో పాటు అన్ని శివాలయాలు భక్తజనంతో నిండిపోయాయి.
ఇక గ్రేటర్‌లోని ఆలయాల్లోనూ భక్తులు పరవాశ్యంతో ఆ పరమశివుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. మేడ్చల్ సమీపంలోని కీసరగుట్టలోనూ శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు.. మహానగర వాసులు పోటెత్తారు.నేడు కీసరగుట్టకు 5లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ముందస్తుగా అక్కడ 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.ఇక హైదరాబాద్ నలుమూలల నుంచి కీసరగుట్టకు చేరుకునేలా 400 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటుచేసింది.