పేటీఎం కస్టమర్లకు తీపికబురు.. ఇకమీదట ఆ చార్జీల ఉండవు..!

-

పేటీఎం వాడుతున్న కస్టమర్స్ అందరు కచ్చితంగా ఓ విషయం తెలుసుకోవాలి. పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ తాజాగా తమ పేటీఎం యూజర్లకు ఒక తీపికబురు చెప్పారు. ఇకమీదట మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకొనేందుకు చార్జీలు ఉండబోవని, వాటిని పూర్తిగా తొలగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్ ఫామ్ పేటీఎం కస్టమర్లకు ఇది గొప్ప శుభవార్త. పేటీఎం తమ కస్టమర్స్ మాములుగా వాలెట్‌ లోని డబ్బులను బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని అనుకుంటే కొంత చార్జీలు వసూలు చేసేది. అయితే ప్రస్తుతం ఈ చార్జీలను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకింటించిది.పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ ఈ విషయాన్ని ఆన్‌లైన్ వేదికగా వెల్లడించారు.

మొబైల్ వాలెట్ కంపెనీ పేటీఎం తాజాగా తన కస్టమర్లకు ఈ అదిరిపోయే న్యూస్ అందించింది. ఆ చార్జీలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పేటీఎం వాడే వారికి మరింత బెనిఫిట్ కలుగనుంది. ప్రస్తుతం పేటీఎంకు 5 కోట్ల మంది నెలవారీ యూజర్లు ఉన్నారు. పేటీఎం యూజర్‌కు విజయ్ శేఖర్ శర్మ ఈ విషయంపై సమాధానం ఇచ్చారు. పేటీఎం వాలెట్ నుంచి బ్యాంక్ అకౌంట్‌ కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు మీరు విధించే 5 శాతం ఫీజు‌ను తొలగిస్తే ఏమౌతుందని ఒక పేటీఎం యూజర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు విజయ్ శేఖర్ శర్మ సమాధానమిచ్చారు. ఇకమీదట ఈ చార్జీలు ఉండబోవని, వారు ఈ చార్జీలు పూర్తిగా తొలగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కానీ ఇక్కడ క్రెడిట్ కార్డు నుంచి పేటీఎం వాలెట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చెయ్యాలని భావిస్తే మాత్రం చార్జీలు చెల్లించుకొక తప్పదు. 2 శాతం ఫీజు పడుతుంది.

అందుకు ఉదాహరణకు మీరు క్రెడిట్ కార్డు నుంచి రూ.100 పేటీఎంకు యాడ్ చేసుకుంటే మీ క్రెడిట్ కార్డు నుంచి రూ.102 కట్ అవుతాయన్నమాట. ఇంకెందుకు ఆలస్యం ఇకనుండి పేటీఎం యూజర్లు వాలెట్ నుండి బ్యాంక్ అకౌంట్ ‌కు డబ్బులు ఎటువంటి చార్జీలు లేకుండా హ్యాపీగా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version