దుబ్బాక ఎన్నికలు ప్రశాంగా ముగిసాయి..అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం అయ్యాయి..దుబ్బాక ఉప ఎన్నికలపై కీలకమైన సర్వే సంస్థలు పెద్దగా ఆసాక్తి చూపించలేనట్లు ఉంది..ఉప ఎన్నికపై ఎగ్జిట్ పోల్ ఎవరు విడుదల చేయలేదు..కొన్ని సంస్థలు మాత్రం దుబ్బాక ఉప ఎన్నిక పోరు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ సంస్థ మరియు పొలిటికల్ ల్యాబోరేటరీ సంస్థలు మత ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి..రెండు సంస్థలు కూడా రెండు వేరువేరు రకాలుగా తమ పోల్స్ ఇచ్చాయి..థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ టీఆర్‌ఎస్ గెలుసుందని ఇస్తే..పొలిటికల్ ల్యాబోరేటరీ మాత్రం బీజేపీ విజయభేరి మోగిస్తుందని ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో తెలిపింది.
థర్డ్ విజన్ రీసెర్చ్ ప్రకారం..దుబ్బాక ఎన్నికలో టీఆర్ఎస్ విజయభేరీ మోగిస్తుందని అంచనా వేసింది..51-54 శాతం ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు తొలిస్థానం లభించగా.. 33-36 శాతం ఓట్లతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు రెండోస్థానం ఇచ్చింది..8-11 శాతం ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి మూడోస్థానం లభించనున్నట్లు పేర్కొంది..పొలిటికల్ ల్యాబోరేటరీ సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మాత్రం బీజేపీ 47 శాతం ఓట్లతో విజయం సాధించబోతున్నట్లు స్పష్టం చేసింది..తర్వాత 38 శాతం ఓట్లతో టీఆర్ఎస్‌కు రెండోస్థానం, కాంగ్రెస్‌కు 13 శాతం ఓట్లు మాత్రమే రానున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది.
దుబ్బాక ఎగ్జిట్ పోల్ ఫలితాలు..ఆ పార్టీకే గెలుపు అవకాశాలు.
-