పన్ను చెల్లింపుదారులకు శుభవార్త..!

-

పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు చెప్పింది. కొత్త రూల్స్ ని పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తీసుకు వచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మరింత ఈజీ చెయ్యాలని చూస్తోంది. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయాలంటే మాములుగా ఒక్కొక్కరు ఒక్కో ఫామ్ ని సెలెక్ట్ చేసుకోవాలి.

అయితే ఇక మీద అలా కాకుండా అందరికీ ఒకే ఐటీఆర్ ఫామ్‌ను ఎంపిక చేసుకోవచ్చు అని కేంద్రం అంటోంది. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కూడా తాజాగా ఈ కామన్ ఐటీఆర్ ప్రతిపాదన చేసింది. ఉన్న అన్ని ఐటీఆర్ ఫామ్స్‌ను కలిపి ఒక ఐటీఆర్ ఫామ్‌ను తీసుకు రావాలని చూస్తోంది. ఐటీఆర్ 7 తప్ప అన్నింటినీ కూడా ఒకదాని కింద తీసుకురావాలని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ చూస్తోంది.

ట్రస్ట్‌లు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు మినహాయించి అన్నింటినీ ఒకే ఐటీఆర్ ఫామ్ ద్వారా రిటర్న్ దాఖలు చేసేయచ్చుట. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ట్యాక్స్ కట్టే దాని మీద మార్పు చెయ్యాలని అనుకుంటోంది. కానీ చెల్లింపుదారులకు రెండు ఆప్షన్లు ఉంటాయి. ఐటీఆర్ 1 నుంచి ఐటీఆర్ 4 వరకు ఫామ్స్ అలానే ఉంటాయి. కనుక ట్యాక్స్ పేయర్లు వీటిని ఎంపిక చెయ్యచ్చు. లేదంటే కొత్తగా తీసుకువస్తున్న ఒకే ఐటీఆర్ ఫామ్‌ను కూడా ఎంపిక చేసుకునే అవకాశం వుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version