హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ కస్టమర్స్ కి అదిరే లాభాలని ఇస్తోంది. ఇలా హెచ్‌డీఎఫ్‌సీ స్కీమ్స్ వలన కస్టమర్స్ చక్కటి ప్రయోజనాలు పొందుతున్నారు. దేశీ దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..
అందుకే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకు వచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దుకాణ్‌దార్ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్ తో ఇప్పుడు దుకాణదారులు, వ్యాపారులు వారి ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడచ్చు.
ఇక ఎంత వరకు పొందొచ్చు అనేది చూస్తే.. ఈ స్కీమ్ కింద రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం పొందొచ్చు. ఈ తరహా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కోసం ఎలాంటి తనఖా పెట్టాల్సిన అవసరం ఉండదు. ఐటీఆర్, బ్యాంక్ స్టేట్‌మెంట్ ఇస్తే చాలు.
ఇక ఎంత వస్తుంది అనేది చూస్తే… షాపులు పెట్టి ఆరేళ్లలోపు అయ్యి ఉంటే రూ.7.5 లక్షల వరకు రుణం పొందొచ్చు. అదే 6 ఏళ్లు దాటితే రూ.10 లక్షల వరకు వస్తుంది. ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ ప్రాతిపదికన మీకు లభించే రుణ మొత్తం మారుతుంది. ఇలా ఈ ఫెసిలిటీ ద్వారా చక్కటి లాభాన్ని కస్టమర్స్ పొందొచ్చు.