ఈ స్మార్ట్‌ సిలిండర్‌లో గ్యాస్‌ ఎప్పుడైపోతుందో తెలిసిపోతుంది!

-

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఓ సరికొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టింది. అదే.. కంపోజిట్‌ సిలిండర్‌ ( Cylinder ) .. ఈ సిలిండర్లు సాధారణ సిలిండర్ల కంటే తేలిగ్గా ఉంటూ మరెన్నో కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందిస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

gas cylinder | సిలిండర్‌
gas cylinder | సిలిండర్‌

మనం వాడే గ్యాస్‌ సిలిండర్‌తో ఇనుముతో తయారు చేసింది కావున మన ఇంటి ఫ్లోర్‌ పై తుప్పు మరకలు పడతాయి. దీంతోపాటు మనం ఇళ్లలో ప్రస్తుతం వాడే సిలిండర్‌ ఎప్పుడు అయిపోతుందో తెలియదు. ఇక ఆ సమస్యను అధిగమించవచ్చు. ఈ కొత్త స్మార్ట్‌ సిలిండర్‌లో గ్యాస్‌ ఎప్పుడు అయిపోతుందో తెలిసిపోతుంది. దీంతో రీఫిల్‌ కూడా బుక్‌ చేసుకోవచ్చు. కంపోజిట్‌ సిలిండర్‌ అంటే ట్రిపుల్‌ లేయర్డ్‌ సిలిండర్‌ అని చెప్పుకోవచ్చు. దీనిలో మొదటి లేయర్‌ గా హై డెన్సిటీ పాలీ ఇథిలిన్‌ లైనింగ్‌ ఉంటుంది. రెండో లేయర్‌ గా పాలిమర్‌ ర్యాప్‌ చేసిన ఫైబర్‌ గ్లాస్, మూడో లేయర్‌ గా హెచ్‌ డీపీఈ అవుటర్‌ జాకెట్‌ ఉంటుంది
అంతేకాదు.. ఈ సిలిండర్‌ చూసేందుకు కూడా ట్రాన్స్‌పరెంట్‌ గా ఉంటుంది.

దీంతో కాస్త లైట్‌ దగ్గర పెడితే చాలు.. గ్యాస్‌ ఎక్కడి వరకు ఉందన్న విషయం సులువుగా తెలుసుకోవచ్చు. దీనివల్ల వినియోగదారులు తమ గ్యాస్‌ ఎన్ని రోజుల పాటు ఉపయోగింవచ్చో తెలుసుకోవచ్చు. హెచ్డీపీఈ తో తయారుచేయడం వల్ల ఈ సిలిండర్‌ వల్ల తుప్పు మరకలు అస్సలు ఉండవు. చాలా స్లీక్‌ డిజైన్‌ తో చక్కగా ఉంటుంది. ఈ సిలిండర్‌ ప్రస్తుతానికి హైదరాబాద్‌ తో పాటు దిల్లీ, గుర్గావ్, ఫరీదాబాద్, లుథియానా ల్లో మాత్రమే అందుబాటులో ఉంచింది ఐఓసీఎల్‌ సంస్థ. కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులో ఉంచుతామని ఆ సంస్థ వెల్లడించింది.ప్రస్తుతం 5,10 కేజీల సైజుల్లో లభిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సిలిండర్లను ఇచ్చి ఈ సిలిండర్లను తీసుకునే వీలుంది. అయితే దీనికోసం కొంత సెక్యూరిటీ డిపాజిట్‌ కట్టాల్సి ఉంటుంది. సబ్సిడీ లేని గ్యాస్‌ సిలిండర్లకు రూ. 3350 (10కేజీలు), రూ,2150(5 కేజీలు) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news