పోస్టాఫీస్‌లో ఖాతా ఇంట్లో నుండే ఓపెన్ చెయ్యొచ్చు తెలుసా..?

Join Our Community
follow manalokam on social media

మీరు పోస్టాఫీస్‌లో ఖాతా ఓపెన్ చెయ్యాలని అనుకుంటున్నారా…? అయితే నిజంగా మీకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. పోస్టాఫీస్‌లో ఖాతా ఓపెన్ చెయ్యాలని అనుకుంటే పోస్టాఫీస్‌ కి వెళ్ళక్కర్లేదు. మీరు ఇంట్లో నుండో ఆపీస్ నుండో కూడా తెరవచ్చు. ఇలా ఎక్కడికీ వెళ్లకుండానే ఇంట్లో నుంచే మీరు సేవింగ్స్ ఖాతా తెరవొచ్చు. అయితే మరి అది ఎలానో ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి. వివరాల లోకి వెళితే… గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఐపీపీబీ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు.

post office services
post office services

ఆధార్ కార్డు, పాన్ కార్డు కచ్చితంగా ఉండాలి గమనించండి. 18 ఏళ్లకు వయసు కలిగిన వారు పోస్టాఫీస్ ఖాతా తెరవొచ్చు. మీరు కనుక అకౌంట్ ఓపెన్ చేస్తే ఐపీపీబీ మొబైల్ యాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు కూడా పొందొచ్చు. పైగా బ్యాలెన్స్ చెక్, మనీ ట్రాన్స్‌ఫర్, ఇతర ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లను యాప్ ద్వారానే నిర్వహించొచ్చు. మరో బెనెఫిట్ ఏంటో తెలుసా పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ RD, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF, సుకన్య సమృద్ధి యోజన SSY వంటి వాటిల్లో కూడా డబ్బులు డిపాజిట్ చేయొచ్చు.

ఇక ఎలా ఓపెన్ చెయ్యాలి అనే విషయానికి వస్తే… యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అకౌంట్ మీద క్లిక్ చేసి పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాక ఓటీపీ ఎంటర్ చెయ్యాలి. వ్యక్తిగత వివరాలు అందించాల్సి ఉంటుంది. తర్వాత మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇది ఏడాది వరకు చెల్లుతుంది. ఈలోపు మీరు పోస్టాఫీస్‌కు వెళ్లి బయోమెట్రిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...