వాహనదారులకు గుడ్ న్యూస్. టూ వీలర్స్ మీద వెళ్లే వాళ్ళు కచ్చితంగా హెల్మెట్ ని ధరించాలి. దీని వలన సురక్షితంగా ఉండచ్చు. అలానే పెద్దగా ప్రమాదం జరగకుండా బయటపడచ్చు. ఈ విషయాలన్నీ తెలిసినా ఇంకా చాలా మంది టూ వీలర్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ ని పెట్టుకోరు. దీని వలన ఇబ్బందులు వస్తాయి.
అయితే ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ని ధరించక పోతే జరిమానాలని వేస్తారు. అప్పుడు ఫైన్ కట్టి ఇబ్బంది పడాలి. హెల్మెట్ ని ధరిస్తే స్పీడ్‌గా వెళ్లేటప్పుడు కంటి నుంచి నీరు రాదు. అలాగే చిన్న చిన్న దోమలు వంటివి కళ్ళల్లో పడకుండా ఉంటాయి. ఇలా హెల్మెట్ ని వేసుకోవడం వలన ప్రయోజనాలు పొందొచ్చు.
బైక్, స్కూటర్ మీద వెళితే పక్కా హెల్మెట్ ని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర హెల్మెట్ లేకపోతె ఇప్పుడైనా కొత్త హెల్మెట్ ని కొనండి. లేదా మీ హెల్మెట్ పాడైపోయినా సరే కొత్తది కొనుక్కోండి. హెల్మెట్ కొంటే రూ.లక్ష బెనిఫిట్ పొందొచ్చు.
ఎలా అనేది చూస్తే.. ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వేగ తో పార్టనర్ షిప్ ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా ఆన్‌లైన్‌లో వేగ హెల్మెట్ కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికీ ఐసీఐసీఐ లంబార్డ్ నుంచి రూ.లక్ష ప్రమాద బీమా వస్తుంది.