కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్న ఇండియన్ రైల్వేస్..!

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వేస్ కొత్త సేవలని తీసుకు రానుంది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ IRCTC వీటిని తీసుకు రావడానికి సిద్ధం అవుతోంది. దీనితో ప్రయాణికులకు మంచిగా ఉంటుంది.

Indian Railways
Indian Railways

అందుకే ఈ స్కీమ్ ని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ IRCTC తీసుకు రావాలని అనుకుంటోంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… దీనిలో భాగంగా ట్రైన్ టికెట్లను దగ్గరి లోని పోస్టాఫీస్‌కు వెళ్లి బుక్ చేసుకోవచ్చు. దీని వల్ల రైల్వే కౌంటర్లలో రద్దీ పెద్దగా ఉండదు. అయితే ఇది మొదట ఉత్తర ప్రదేశ్‌లో రానుంది.

ఈ కొత్త సర్వీసులు నేటి నుండి అంటే జనవరి 6 నుంచి ఈ సర్వీసులు ప్రారంభం అవుతాయి. పోస్టాఫీస్‌కు వెళ్లి ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. యూపీ లో 9 వేలకు పైగా పోస్టాఫీస్‌లు ఉన్నాయి. అన్నింటి లోనూ రైల్వే టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ఈ సేవలను మొదలు పెట్టనున్నారు. ఐఆర్‌సీటీజీ అధికారిక ఏజెంట్లు, జీడీఎస్‌ల వల్ల మారుమూల ప్రాంతాల్లో కూడా ట్రైన్ టికెటు బుకింగ్ సేవలు తీసుకురానున్నారు. అలానే కోవిడ్ రూల్స్ ని కూడా ఫాలో అవ్వాలని అంది.