ఇండిగో ఎయిర్లైన్స్ న్యూఇయర్ గిఫ్ట్… ఫ్లైట్ టికెట్ పై భారీ తగ్గింపు..

-

మరి కొద్ది రోజుల్లో న్యుయర్ రానున్న సంగతి తెలిసిందే..ఈ మేరకు ఇండిగో ఎయిర్లైన్స్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.ఇండిగో ఎయిర్‌లైన్స్ వింటర్ సేల్ ప్రారంభించింది. ఈ సేల్ 2022 డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 25 వరకు కొనసాగుతుంది. ఈ మూడు రోజుల్లో డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్స్‌ ను రూ.2023 ధరకు, ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్స్‌ను రూ.4,999 ధరకు సొంతం చేసుకోవచ్చు..

ఇకపోతే వచ్చే ఏడాది ఫ్లైట్ జర్నీ చేయాలనుకునేవారికి ఈ ఆఫర్ ఉపయోగపడుతుంది. 2023 జనవరి 15 నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య ట్రావెల్ ప్లాన్ చేసుకునేవారు ఆఫర్ ధరకే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇండిగో అందించే డిస్కౌంట్‌తో పాటు హెచ్ఎస్‌బీసీ బ్యాంక్ నుంచి క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.. ముందుగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నవారికి మాత్రమే ఆఫర్ ధరకు ఫ్లైట్ టికెట్స్ లభించే అవకాశాలు ఎక్కువ. ఆఫర్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేముందు నియమాలను కూడా పాటించాలి..

ఇది అన్నిటికీ వర్తించదు.. కేవలం నాన్ స్టాప్ ఫ్లైట్స్‌కు మాత్రమే లభిస్తుంది. ఇతర ఆఫర్స్‌తో కలిపి వింటర్ సేల్ ఆఫర్స్ పొందే అవకాశం ఉండదు. ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన తర్వాత ఏవైనా మార్పులు ఉంటే ఛేంజ్ ఫీజ్, మారిన ఫేర్ ప్రకారం డబ్బులు చెల్లించాలి. హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ కార్డుతో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తే 5 శాతం క్యాష్‌ బ్యాక్ లభిస్తుంది. గరిష్టంగా రూ.750 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. కనీసం రూ.5,000 నుంచి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలి. 60 రోజుల్లో క్యాష్‌బ్యాక్ క్రెడిట్ అవుతుంది.. ఇండిగో రవాణా చేసే ప్రయాణీకుల వాటా గత నెల తో పోలిస్తే 55.7 శాతానికి తగ్గింది. ఇండిగో నవంబర్‌లో 6.5 మిలియన్ల కు పైగా ప్రయాణీకులను తమ ఫ్లైట్స్‌తో వారి స్థానాలకు చేర్చింది..

Read more RELATED
Recommended to you

Exit mobile version