పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవడానికి విధించిన చివరి తేదీ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వచ్చే సంవత్సరం అనగా 2021 మార్చి 31వ తేదీ వరకు పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవచ్చని తెలిపింది. నిజానికి ఈ లింక్ కి సంబంధించిన చివరి తేదీని 2020 జూన్ 30వరకే నిర్ణయించింది. కానీ ప్రస్తుతం ఈ తేదీని పొడిగించింది. ఇప్పటివరకూ ఎవరైతే పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోలేదో, వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు.
ఈ లింక్ పూర్తి కాకపోతే భవిష్యత్తులో పాన్ కార్డు అవసరమయ్యే దగ్గర ట్రాన్సాక్షన్స్ అందుబాటులో ఉండవని అంటున్నారు. బ్యాంకు ట్రాన్సాక్షన్లలో పాన్ కార్డు అవసరం చాలా ఉంటుంది. ఖాతా ఓపెన్ చేయడానికి గానీ, పరిమితికి మించి డబ్బు జమ చేయాలన్నా, తీసుకోవాలన్న పాన్ కార్డ్ కంపల్సరీ. పాన్ కార్డుతో ఆధార్ కార్డ్ లింక్ చేసుకోకపోతే ఇలాంటి సదుపాయాలకి భంగం కలుగుతుందట.
ఆదాయ పన్ను కడుతున్న వారు, ప్రత్యేకంగా లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ వారు టాక్స్ ఫైల్ చేసినపుడే ఆధార్ తో లింక్ చేసి ఉంచుతారు. లింక్ చేసారా లేదా అని తెలుసుకోవడానికి ఈ వెబ్ సైట్ www.incometaxindiaefiling.gov.in లోకి లాగ్ ఇన్ అయితే తెలిసిపోతుంది. లాగ్ ఇన్ అయ్యాక మీ పాన్ కార్డుతో అధార్ లింక్ లేదని తెలిస్తే, అక్కడ ఒక ఫామ్ ఉంటుంది. దానిలో ఉన్న వివరాలన్నింటినీ పూర్తి చేస్తే పాన్ కార్డుతో ఆధార్ లింక్ అయిపోతుంది.
ఒకవేళ మీరు ఇన్ కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయకపోతే,
ముందుగా ఈ https://incometaxindiaefiling.gov.in/ సైటులోకి ఎంటర్ అవ్వండి.
మెనూ లో ఉన్న ఆధార్ లింక్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
అప్పుడు తెరపై మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, పేరు తెలియజేయండి.
మీ ఆధార్ కార్డులో కేవలం మీరు పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే, అక్కడ ఉన్న అదే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
అన్ని వివరాలు సరిగ్గా ఇచ్చారో లేదో ఒకసారి చూసుకున్నాక సబ్మిట్ నొక్కండీ.
అంతే, మీ పాన్ కార్డుకి ఆధార్ లింక్ అయ్యిందని మెసేజ్ వచ్చేస్తుంది.