ఎల్‌ఐసీ బచత్‌ ప్లస్‌ కొత్త ప్లాన్‌తో రక్షణ, పొదుపు!

-

ప్రభుత్వ రంగ అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ మరో కొత్త పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ‘బచత్‌ ప్లస్‌’ పేరిట ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది పాలసీదారుడికి బీమా రక్షణతో పాటు పొదుపు కోసం దీన్ని రూపొందించారు. ఐదేళ్ల మెచ్యూరిటీ కాలపరిమితితో వచ్చే ఈ ప్లాన్‌ తీసుకున్న పాలసీదారుడు హఠాత్తుగా మరణిస్తే, అతని కుటుంబానికి రెండు విధాలుగా పరిహారం చెల్లిస్తుంది.

ఐదేళ్లలోపు మరణించినప్పుడు నిబంధన ప్రకారం ఒకేసారి పాలసీ విలువను చెల్లిస్తారు.ఆ తర్వాత మరణిస్తే అతని కుటుంబానికి పరిహారంతో పాటు, లాయల్టీతో కలిపి కుటుంబానికి ఒకేసారి సొమ్ము అందిస్తారు. దీనికి పాలసీదారుడు సింగిల్‌ ప్రీమియం విధానంలో ఒకేసారి ప్రీమియం మొత్తాన్ని చెల్లించవచ్చు లేదా ఐదేళ్ల పాటు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉంది. ఈ ప్లాన్‌లో చేరిన పాలసీదారుడికి 80సీ కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. 180 రోజుల పాటు మాత్రమే ఈ పాలసీ అందుబాటులో ఉంటుంది. ఈ పాలసీని కనీసం రూ.1 లక్ష నుంచి తీసుకోవచ్చు. ఈ పాలసీలో ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. బచత్‌ ప్లస్‌ ప్లాన్‌ను లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఏజెంట్‌ ద్వారా లేదా ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

  • ఈ ప్లాన్‌లో చేరిన వారికి మెచ్యూరిటీ అమౌంట్‌పై హామీ ఇవ్వబడుతుంది. పాలసీ వ్యవధి 5 ఏళ్ల పాటు, అన్ని ప్రీమియంలు సకాలంలో చెల్లించినట్లయితే, అదనంగా లాయల్టీ బోనస్‌ కూడా పొందవచ్చు.

ప్రీమియం ఎంపిక

పాలసీని తీసుకునేవారు సింగిల్‌ ప్రీమియం లేదా లిమిటెడ్‌ ప్రీమియం అనే రెండు ఆప్షన్లలో ప్రీమియంను చెల్లించవచ్చు.

పాలసీదారుడికి హఠాత్తుగా మరణిస్తే.. సింగిల్‌ ప్రీమియం ప్లాన్‌లోని ఆప్షన్‌ ఏ కింద బేసిక్‌ సమ్‌ అస్యూర్డ్‌ అమౌంట్‌ 10 రెట్లు అతని కుటుంబానికి అందుతుంది. ఆప్షన్‌ బీ కింద సమ్‌ అస్యూర్డ్‌ అమౌంట్‌ మొత్తానికి 1.25 రెట్లు ఇవ్వబడుతుంది.

వయోపరిమితి

ఎల్‌ఐసీ బచత్‌ ప్లస్‌ సేవింగ్‌ ప్లాన్‌ తీసుకోవడానికి సింగిల్‌ ప్రీమియం కోసం కనీస వయస్సు 90 రోజులు, గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు ఉండాలి. కానీ, ఆప్షన్‌ ‘ఏ’కు 70 ఏళ్ల గరిష్ట వయోపరిమితి వర్తిస్తుంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version