రూ.3,555 ఈఎంఐ తో ఈ కారుని కొనుగోలు చెయ్యొచ్చు..! పూర్తి వివరాలు ఇవే..!

Join Our Community
follow manalokam on social media

మీరు కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా…? అయితే ఇది మీరు తప్పక చూడాలి. ఈ ఏడాది కార్ల పై ఎన్నో ఆఫర్స్ ని తీసుకొచ్చారు. అయితే తాజాగా ప్రవేశ పెట్టిన ఈ ఆఫర్ కూడా అదిరి పోయింది అనే చెప్పాలి. అయితే ఈ ఏడాది ఆఫర్ల తో పాటుగా అదిరిపోయే రేటింగ్ ను పలు కార్లు మార్కెట్ లో అందుకుంది కూడా. ఇక అసలు విషయానికి వస్తే… కొత్తగా కారు కొనాలని అనుకుంటే మీకోసం సూపర్ ఆఫర్ ఒకటి ఉంది.

ఇక దాని కోసం చూస్తే… ప్రముఖ దేశీ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ కొనుగోలుదారులకు తక్కువ ఈఎంఐ తోనే కొత్త కారు ఇంటికి తీసుకెళ్లే ఛాన్స్ కల్పిస్తోంది. అయితే మీరు కనుక ఈ ఆఫర్ ని వినియోగించుకుని కారుని కొనుగోలు చేసారంటే డబ్బులు ఆదా చేసుకోవచ్చు. టాటా మోటార్స్ వెబ్‌సైట్ లో అందించిన సమాచారం ప్రకారం.. టాటా టియాగో కారును నెలకు కేవలం రూ.3,555 ఈఎంఐ తో మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ కారు ధర రూ.4.85 లక్షల నుంచి ఇది స్టార్ట్ అవుతోంది. వాటే ఆఫర్ కదా…!

కేవలం ఈ వివరాలని మాత్రమే ఇందులో అందుబాటు లో ఉన్నాయి. మీరు కనుక కారుని కొనుగోలు చెయ్యాలి అనుకుంటే టాటా మోటార్స్ వెబ్‌సైట్‌కు వారి పేరు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఇచ్చి కాల్ బ్యాక్ కోసం రిక్వెస్ట్ చేయాలి. ఆ తరువాత కంపెనీ వాళ్ళు తిరిగి మిమ్మల్ని సంప్రదిస్తారు. అప్పుడు మీరు మీకు ఉన్న సందేహాల్ని అన్ని అడగొచ్చు.

TOP STORIES

వనదేవతల జాతర.. మినీ మేడారం

సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తున్నారు. మండమేలిగే పండగ సందర్భంగా...