ముత్తూట్ కస్టమర్లకు తీపికబురు… కొత్త సేవల వివరాలు ఇవే…!

Join Our Community
follow manalokam on social media

ముత్తూట్ ఫైనాన్స్ కస్టమర్లకు తీపి కబురు చెప్పింది. ఇప్పుడు కొత్త సర్వీసులని ముత్తూట్ కస్టమర్లకు తీసుకు రావడం జరిగింది. గోల్డ్ లోన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే తప్పక మీరు వీటి గురించి చూడాల్సిందే…! ఇక దాని కోసం వివరాల లోకి వెళితే…. ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ అన్ లాకర్ పేరు తో కొత్త సేవలు తీసుకు రావడం జరిగింది.

ఇందులో భాగంగా పలు బెనిఫిట్స్ పొందొచ్చు. ప్రముఖ బంగారు రుణాల సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ తీసుకునే వారికి బెనిఫిట్స్ ని ఇవ్వనుంది. ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ అన్‌లాకర్ పేరుతో కొత్త సర్వీసులు స్టార్ట్ చేసింది. ఈ సర్వీసుల వివరాల లోకి వస్తే.. కస్టమర్లు వారి బంగారంపై ఎప్పుడైనా, ఎంత మొత్తాన్ని అయినా, ఎక్కడి నుంచైనా పొందొచ్చు. బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్‌కు వెళ్లి తనఖా పెట్టాలి అంతే.

మీ బంగారం పై ఎంత రుణం తీసుకో వచ్చొ తెలుస్తుంది. దీనితో మీరు రుణ మొత్తం లో మీకు నచ్చిన డబ్బును పొందొచ్చు. అయితే మిగిలిన డబ్బుని మీ గోల్డ్ ముత్తూట్ అన్‌లాకర్ అకౌంట్ ‌లో ఉంచొచ్చు. ఇలా మీరు ఉపయోగించిన డబ్బుకే వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. ఐముత్తూట్ యాప్ నుండి మీరు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చెయ్యవచ్చు. అన్ని ప్రాంతాల్లోనూ అందుబాటు లోకి ఈ సేవలు రాలేదు. ఎంపిక చేసిన పట్టణాలు, నగరాల్లో మాత్రమే ఈ సర్వీసులు లభిస్తున్నాయి.

TOP STORIES

ఎంఆధార్‌ యాప్‌ తో 35 రకాల ఆధార్ సేవలు… వివరాలు ఇవే..!

మీ ఫోన్ లో ఎంఆధార్‌ యాప్ వుందా...? అయితే మంచిగా 35 రకాల ఆధార్ సేవలు వున్నాయి. సులువుగా ఉపయోగించుకోండి. దీని వలన మీకు సూపర్...