ఆదాయ పన్నును చెల్లిస్తున్నారా? అయితే వీటిని తప్పకుండ తెలుసుకోవాల్సిందే..!

-

ప్రతి సంవత్సరం ఆదాయ పన్నుకు సంబంధించి ఎన్నో మార్పులు జరుగుతాయి. కాకపోతే సరైన అవగాహన ఉన్నవారు మాత్రమే వాటిని అర్ధం చేసుకోగలరు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఆదాయపు పన్ను చెల్లించేందుకు ఆదాయపు పన్ను శాఖ కొత్త ఫారాలను ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి నోటీస్ కూడా ప్రభుత్వం నుండి వచ్చింది. త్వరలోనే దీనికి సంబంధించి ఎక్స్ఎల్ యుటిలిటీ ని కూడా ప్రారంభించనున్నారు. దీని ద్వారా చెల్లింపు దారులు ఐటిఆర్ రిటర్న్స్ దాఖలు చేయడాన్ని మరింత సులభంగా చేసుకోవచ్చు.

అయితే ఈ ప్రక్రియను రెండు విధాలుగా చేయవచ్చు. ఫారాలను దాఖ చేసే ముందు అనువైన పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. పాత పన్ను విధానం మరియు కొత్త పన్ను విధానాల మధ్య ముఖ్యమైన తేడా ఏమిటంటే, కొత్త విధానంలో తక్కువ పన్ను స్లాబులు కలిగి ఉంటాయి. అయితే ఇందులో ఆదాయ పన్నుకు సంబంధించి మినహాయింపులను పొందడం జరగదు. ఎప్పుడైతే పాత పన్ను విధానం ద్వారా పన్నును చెల్లిస్తారో, సెక్షన్ ఐటిసి 80సి, 80డీ, 80డీడీ, 80యు కింద మినహాయింపులను పొందవచ్చు. కాకపోతే ఇలా చేయడం వలన మీ ఆదాయం పై అధిక పన్ను రేటు పరిధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది.

హెచ్ఆర్ఏ మినహాయింపును పొందాలనుకుంటే, పాత విధానం ప్రకారం పన్నును చెల్లించాలి, ఎందుకంటే కొత్త విధానంలో హెచ్ఆర్ఏ మినహాయింపు ఉండదు. అదే విధంగా కొత్త పన్ను విధానంలో, ఇంటి ఆస్తిని కొనుగోలు చెయ్యడానికి తీసుకున్న అప్పు పై కడుతున్న వడ్డీని ఆదాయపు పన్నులో మినహాయింపు చేయలేరు. కనుక స్వీయ ఆక్రమిత ఇంటి కోసం తీసుకున్న పెట్టుబడి పై వడ్డీ తగ్గించుకోవాలనుకుంటే, పాత పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవాలి. కాబట్టి, ఐటిఆర్ ఫైలింగ్ చేసే ముందు ఈ మార్పులను బాగా అర్థం చేసుకోవడం ఎంతో అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news