కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇకపై రైతులకు పీఎం-కిసాన్ పథకం కింద నిధులు అందాలంటే ఆధార్ తప్పనిసరి. ఇకనుంచి అర్హులైన రైతులకు ఆధార్‌తో అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాలు ఉంటేనే నగదు బదిలీ చేస్తారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంగళవారం లోక్‌సభలో ప్రకటించారు. ఈ సరికొత్త నిబంధన డిసెంబర్ 2019 నుంచే అమలులోకి రానుంది.
దేశవ్యాప్తంగా పీఎం-కిసాన్ పథకం కింద 14 కోట్ల మంది రైతులకు రూ.6 వేల చొప్పున ఇస్తున్నారు. ఇక రైతులకు ఆర్థికంగా చేయూత అందించాలన్న లక్ష్యంతోనే మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అమలు చేసింది. పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ఏడాదికి రూ.6 వేలు అందిస్తుంది. ఈ రూ.6వేలు ఒకేసారి కాకుండా దశల వారీగా మూడు దశల్లో రు.2 వేల చొప్పున మొత్తం రు. 6 వేలు అందజేస్తారు.
ఇప్పుడు రైతులందరికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. బ్యాక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేసిన వారికి మాత్రమే డబ్బు అందుతుంది. ఇక మోదీ 2019 ఫిబ్రవరి 24న యూపీలోని గోరక్‌ఫూర్‌లో ఈ పథకం ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ పథకంలో నగదు బదిలీ చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పాటించలేదు. అయితే ఇకపై మాత్రం బ్యాంక్ ఖాతాలు తప్పనిసరిగా ఆధార్‌తో అనుసంధానం కావాల్సిందే.
ఇకపై ఈ పథకానికి అర్హులు అయిన రైతులు తమ బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. లేనిపక్షంలో వారి ఖాతాల్లోకి డబ్బులు జమచేయరు. ఇక ఇప్పటికే ఆధార్ లేదన్న కారణంతో రేషన్ కార్డుల డేటాబేస్ నుంచి లబ్ధిదారుల పేర్లు తొలగించొద్దని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించినట్లు ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ లోక్‌సభలో తెలిపారు.