ఏడాదికి రూ. 22 కట్టండి.. రూ.6 లక్షల ప్రయోజనాలు పొందండి..!

ప్రజల కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంటాయి. కానీ.. దురదృష్టం ఏంటంటే వాటి గురించి ప్రజలకు అవగాహన ఉండదు. అవగాహన కల్పించే ప్రయత్నం ప్రభుత్వాలు చేయవు. అలాంటి అద్భుతమైన పథకాల్లో లేబర్ ఇన్సూరెన్స్ ఒకటి. లేబర్ ఇన్సూరెన్స్ అనగానే కేవలం కార్మికులు మాత్రమే అనుకుంటారు.

కానీ ఇది తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరూ ఈ ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు తప్ప అంతా ఇందుకు అర్హులే. కూలీలతో పాటు కార్మికులు, చిరుద్యోగులు అందా ఈ బీమా పొందొచ్చు. ఇందుకు మీకయ్యే ఖర్చు కేవలం ఏడాదికి రూ. 22 మాత్రమే. ఈ బీమా పొందాలంటే.. రూ. 110 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఐదేళ్ల వరకూ బీమా ఉంటుందన్నమాట. ఆ తర్వాత దాన్ని రెన్యువల్ చేయించుకోవచ్చు. 18 నుండి 55 ఏళ్ల వయస్సున్న స్త్రీ , పురుషులు ఇందుకు అర్హులు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ అవసరం. బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో ఇవ్వాలి.

ఈ బీమా పొందితే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. పాలసీదారు సహజ మరణం పొందితే రూ.1,30,000/-రులు ఇన్సూరెన్స్ వస్తుంది. అలాగే ప్రమాద వశాత్తూ మరణం వల్ల రూ.6,00000/- బీమా సొమ్ము వస్తుంది. ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000/-రూ ఇస్తారు. ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు 30,000/-రూ చొప్పున వచ్చే అవకాశం ఉంది.

పాలసీ పొందిన ఒక ఏడాది తర్వాత లబ్ధిదారునికి ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.50 లక్షలు, అదే 100% వికలాంగులైతే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది. ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి. వివరాల కోసం మీ మండలంలోని కార్మిక అధికారిని లేదా ఎంపీడీవో, ఎమ్మార్వోలను సంప్రదించండి.