రైతుల కోసం పీఎం కిసాన్ స్కీమ్ ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలోని లక్షలాది మంది రైతులు ఈ స్కీమ్ లో వున్నారు. పైగా తొమ్మిది విడతల డబ్బులని పొంది.. ఎప్పుడు పదవ విడత డబ్బులు తమ అకౌంట్‌లో పడతాయా అని ఎదురు చూస్తున్నారు. అయితే మరి ఎప్పుడు వస్తాయి అనేది చూస్తే..
ఏప్రిల్-జూన్ మధ్య తొలి విడత, ఆగస్టు- నవంబర్ మధ్య రెండో విడత, డిసెంబర్- మార్చి మూడో విడత ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో వేస్తారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పదో విడత డబ్బులు డిసెంబర్ 15 నాటికి రైతుల అకౌంట్‌లో పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి కోసం ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యం తోనే ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు.
ఇది ఇలా ఉంటే లబ్దిదారులు తమ పేర్లను పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో చెక్ చేసుకోవచ్చు. అలానే ఏదైనా సందేహాలు కానీ వివరాలని కానీ పొందాలి అంటే కాల్ చేసి వాటిని క్లియర్ చేసుకోచ్చు. అలానే లబ్దిదారులు తమకు వచ్చే ఆర్థిక సాయం వివరాలను https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx లో చూసుకోవచ్చు. వీటిలో పూర్తి వివరాలు ఉంటాయి కనుక చూసుకొని సందేహాల్ని క్లియర్ చేసుకోచ్చు. ఇలా రైతులకి క్లారిటీ వచ్చేస్తుంది.