తిరుమల వెళ్లడానికి ఆన్‌లైన్‌లో రూమ్ బుక్ చేస్తున్నారా? ముందు ఇవి తెలుసుకోండి..

-

కలియుగ దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలకు వెళ్లాలని ఎవరికి ఉండదు చెప్పండి. తిరుమల వెంకన్నను దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ.. తిరుమలకు వెళ్లాలంటే సరైన ప్లానింగ్ ఉండాలి. లేదంటే అనేక సమస్యలను అక్కడ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే.. ముందస్తు ప్లానింగ్ చేసుకోవాలి. అది కూడా కనీసం 2 నెలల ముందు తిరుమల టూర్‌కు ప్లాన్ చేసుకుంటే ఎటువంటి సమస్యలు లేకుండా హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు.

అయితే.. తిరుమల టూర్‌కు ప్లాన్ చేయాలంటే.. ఆన్‌లైన్ బుకింగ్‌ను నమ్ముకోవాల్సిందే. అయితే.. ఆన్‌లైన్‌లో రూమ్స్ కానీ.. ఇతరత్రా బుక్ చేసేముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకున్నాక.. ఆన్‌లైన్‌లో రూమ్స్ బుక్ చేసుకోండి.

ఎన్నిరోజుల ముందు బుక్ చేసుకోవాలి?

టీటీడీకి సపరేట్‌గా వెబ్‌సైట్ ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. టీటీడీ ఆన్‌లైన్ అకామడేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే.. 60 రోజుల ముందు నుంచి ఆన్‌లైన్‌లో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. దాని కోసం టీటీడీ సేవా ఆన్‌లైన్‌లో ముందు రిజిస్టర్ చేసుకొని ఆ తర్వాత ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. మినిమమ్ 100 రూపాయల రూమ్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఏసీ, లగ్జీరీ రూమ్ కావాలంటే కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చవుతాయి. ప్రతి రూమ్‌కు రెండు బెడ్స్ ఉంటాయి. ఒక్క రూమ్‌లో ఆరుగురు వరకు ఉండొచ్చు. అయితే.. ఒక్క రూమ్‌లో ఎంతమంది ఉంటారు.. అనే దానిపై ఎటువంటి రిస్ట్రిక్షన్ ఉండదు. దాన్ని టీటీడీ పట్టించుకోదు.

ఎన్ని రోజులకు రూమ్ తీసుకోవాలి?

సాధారణంగా 24 గంటల వరకు మాత్రమే ఒక రూమ్‌ను అద్దెకు ఇస్తారు. 24 గంటలు దాటితే అదనంగా డబ్బులు చెల్లించాలి అంతే.

రూమ్‌లు ఎక్కడ ఉంటాయి?

ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వాళ్లకు తిరుమల సీఆర్‌వో ఆఫీసు దగ్గర రూమ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్లి బుకింగ్ ఐడీ కానీ.. బుకింగ్ రిసీప్ట్ కానీ ఏదైనా చూపిస్తే.. వాళ్లు రూమ్ చూపిస్తారు. అక్కడే మిగితా టికెట్లు కూడా తీసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో రూమ్ బుక్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఆన్‌లైన్‌లో రూమ్ బుక్ చేసే ముందు ఆధార్ నెంబర్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. బుకింగ్ అయిన తర్వాత వచ్చే రిసీప్ట్ ప్రింట్ తీసుకొని.. గుర్తింపు కార్డు జిరాక్స్ తీసుకొని వెళ్లాలి. రూమ్ బుక్ చేసే ముందు బుకింగ్ స్లాట్‌ను జాగ్రత్తగా ఎంచుకోవాలి. స్లాట్ అంటే రూమ్‌లోకి ఏ సమయంలో వస్తారు అని అర్థం అన్నమాట. అక్కడ రెండు స్లాట్లు ఉంటాయి. ఒకటేమో.. అర్ధరాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. ఇంకోటేమో.. మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 వరకు. అర్ధరాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్లాట్‌ను బుక్ చేసుకుంటే… మీరు మధ్యాహ్నం 12 గంటలోపే రూమ్‌కు చేరుకోవాలి. 12 దాటాక మీరు వెళ్తే.. మీకు రూమ్ ఇవ్వరు. అందుకే.. బుక్ చేసేముందు సరైన స్లాట్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Exit mobile version