మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ డ్రైవింగ్ సెంటర్ల గురించి రూల్స్..!

-

మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ శుక్రవారం నాడు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని వలన మంచిగా డ్రైవింగ్ నేర్చుకోవడానికి వీలవుతుంది. పైగా ఏ ప్రమాదాలు జరగకుండా కూడా దీని వలన కుదురుతుంది.

డ్రైవర్స్ ట్రైనింగ్ సెంటర్స్ ని కచ్చితంగా పెట్టాలని దీని వలన ఎన్నో ప్రయోజనాలు వున్నాయి అని అన్నారు. అయితే ఈ కొత్త రూల్స్ జూలై 1 నుంచి అమలు లోకి వస్తాయని దీన్ని వల్ల సరైన ట్రైనింగ్ మరియు నాలెడ్జ్ ఆ సెంటర్ల ద్వారా డ్రైవర్ల కి వస్తుందని అన్నారు.

ఈ సెంటర్స్ గురించి మరి కొన్ని ముఖ్యమైన విషయాలు:

ఈ సెంటర్లలో మంచి ఎక్విప్మెంట్ ఉండాలి. దీనివల్ల మంచి నాణ్యమైన ట్రైనింగ్ అందుతుంది.
రెమిడియల్ మరియు రిఫ్రెషర్ కోర్సెస్ రిక్వైర్మెంట్ ఆధారంగా ఉండాలని. అండర్ మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ఈ సెంటర్లలో ఉంచాలి.
ఎవరైతే సెంటర్లలో టెస్ట్ పాస్ అవుతారో వాళ్లకి డ్రైవింగ్ టెస్ట్ అవసరం లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది.
సరైన జ్ఞానం లేక పోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని.. మంచి స్కిల్స్ తో డ్రైవింగ్ నేర్చుకోవాలని వీటిని మొదలు పెడుతున్నారు.
ఇవి ఇండస్ట్రీ స్పెసిఫిక్ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ కూడా ఇస్తుంది.

మోటారు వాహనాల (సవరణ) చట్టం 2019 లోని సెక్షన్ 8 డ్రైవర్ శిక్షణా కేంద్రాల అక్రిడిటేషన్‌కు సంబంధించి నియమాలను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది.

డ్రైవింగ్ లైసెన్సు పొందాలనుకునే వారు కఠినమైన నైపుణ్య పరీక్షల సమితిలో ప్యాస్ అవ్వాలని, ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ pass percentage 69 శాతంగా నిర్ణయించబడింది.

ఇది ఇలా ఉంటే ఈ ఏడాది మార్చిలో, గడ్కరీ పార్లమెంటుకు 50 కి పైగా మోటారు డ్రైవింగ్ శిక్షణా సంస్థలకు డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడానికి ఢిల్లీ ప్రభుత్వ ఎన్‌సిటి రవాణా శాఖ అధికారం ఉందని తెలిపింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version