SBI: ఈ అకౌంట్ తెరిస్తే ఉచితంగానే రూ.30 లక్షల ప్రయోజనం..!

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)ఎన్నో రకాల సర్వీసులని ఇస్తోంది. వీటి వలన కస్టమర్స్ కి లాభంగా ఉంటుంది. ఇది ఇలా ఉంటే బ్యాంకుల్లో ఎన్నో రకాల అకౌంట్లు ఉన్నాయి. సేవింగ్స్ ఖాతా, కరెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, జీరో అకౌంట్ మొదలైనవి. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో కనుక శాలరీ అకౌంట్ తెరిస్తే.. రూ.30 లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ బెనిఫిట్ పొందొచ్చు.

SBI

ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఎస్‌బీఐలో కనుక శాలరీ అకౌంట్ తెరిస్తే.. రూ.30 లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ బెనిఫిట్ పొందొచ్చు. అదే విధంగా అపరిమిత ఏటీఎం లావాదేవీలు కూడా నిర్వహించొచ్చు.

అలానే ఉచిత నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ సర్వీసులు లభిస్తాయి. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇలా శాలరీ అకౌంట్ తెరిస్తే చాలా బెనిఫిట్స్ పొందొచ్చు. ఎస్బీఐ శాలరీ ఎకౌంట్ ఉంటే యాక్సిడెంటల్ డెత్ కవర్ లభిస్తుంది. రూ.20 లక్షల వరకు ప్రమాద బీమా వర్తిస్తుంది కూడా.

ఏ తరహా లోన్ తీసుకున్నా కూడా 50 శాతం ప్రాసెసింగ్ ఫీజు తగ్గింపు కూడా లభిస్తుంది. అంతే కాదండి 2 నెలల ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంది. అంటే మీరు 2 నెలల వేతనాన్ని ముందుగానే పొందొచ్చు.

పైగా లాకర్ చార్జీల్లో కూడా వీరికి తగ్గింపు ఉంటుంది. లాకర్ చార్జీల్లో మీద 25 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. ఎస్ఎంఎస్ అలర్ట్స్ కూడా ఉచితంగానే పొందొచ్చు. ఇలా ఇన్ని లాభాలు కలుగుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version