ఎస్‌బీఐ కస్టమర్లకు తీపి కబురు. ఇప్పుడు ఈ కొత్త స్కీమ్ తో మరెంత లాభం పొందొచ్చు. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్త ఫండ్ తీసుకు వచ్చింది. మరి దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్త ఫండ్ ని తీసుకు రాగా 18 ఏళ్లు దాటిన వారు ఈ మ్యూచువల్ ఫండ్ లో చేరొచ్చు. సిప్ రూపంలో కూడా డబ్బులు పెట్టొచ్చు. మీరు కనుక రిటైర్ అయ్యిన తర్వాత అధిక మొత్తంలో పొందాలని అనుకుంటే ఇది మీకు బెస్ట్. ఇందులో డబ్బులు పెట్టడం వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడి పొందే ఛాన్స్ ఉండొచ్చు.
అగ్రెసివ్ (80-100 శాతం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు), అగ్రెసివ్ హైబ్రిడ్ (65-80 శాతం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు), కన్సర్వేటివ్ హైబ్రిడ్ (60-90 శాతం డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు), కన్సర్వేటివ్ (80-100 శాతం డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు) ఇలా నాలుగు ఉన్నాయి. అయితే ప్రతి ఆప్షన్ లో 20 శాతం వరకు Gold ETFs గోల్డ్ ఈటీఎఫ్‌లలో, 10 శాతం వరకు రీట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. రూ.5 వేలు నుండి కూడా దీనిలో ఇన్వెస్ట్ చెయ్యొచ్చు. సిప్ రూపంలో తర్వాత డబ్బులని పెట్టవచ్చు. సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసే వారికి రూ.50 లక్షల వారు టర్మ్ ఇన్సూరెన్స్ పొందొచ్చు.