అనిల్ కుంబ్లేలా మారిన జ‌స్‌ప్రిత్ బుమ్రా.. వైర‌ల్ వీడియో..!

-

ఇండియ‌న్ క్రికెట్ టీంకు అనిల్ కుంబ్లే ఎంతో అద్భుత‌మైన సేవ‌లు అందించాడు. లెగ్ స్పిన్ బౌల‌ర్‌గా ప్ర‌పంచ స్థాయి గుర్తింపు పొందాడు. కుంబ్లే ఖాతాల్లో ఎన్నో రికార్డులు కూడా ఉన్నాయి. అత‌ను కొంత కాలం పాటు టీమిండియా కెప్టెన్‌గా కూడా విధులు నిర్వ‌ర్తించాడు. అయితే ఒక్కో బౌల‌ర్‌కు ఒక్కో శైలి, బౌలింగ్ యాక్ష‌న్ ఉన్న‌ట్లుగానే కుంబ్లేకు కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే భార‌త క్రికెట్ జ‌ట్టు ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్‌ప్రిత్ బుమ్రా స‌ర‌దాగా కాసేపు కుంబ్లేలా బౌలింగ్ చేశాడు.

ఫిబ్ర‌వ‌రి 5వ తేదీ నుంచి భార‌త్‌, ఇంగ్లండ్‌ల మ‌ధ్య తొలి టెస్టు మ్యాచ్ చెన్నైలో జ‌ర‌గ‌నున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే ఇప్ప‌టికే రెండు టీమ్‌లు చెన్నైకి చేరుకుని నెట్స్‌లో సాధ‌న చేస్తున్నాయి. ఇక టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ బుమ్రా కొంత‌సేపు నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ క్ర‌మంలో బుమ్రా స‌ర‌దాగా కాసేపు కుంబ్లేలా బౌలింగ్ చేశాడు.

క్రికెట్ మ్యాచ్‌ల‌లో కుంబ్లే బౌలింగ్ చేస్తుంటే ఆక‌ర్ష‌ణీయంగా అనిపిస్తుంది. అందుక‌ని అచ్చం అలాగే బుమ్రా బౌలింగ్ చేసి స‌ర‌దా తీర్చుకున్నాడు. కాగా ఆ వీడియోను ఇండియ‌న్ క్రికెట్ టీం ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయ‌గా.. అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దానికి ఇప్ప‌టికే 18 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. ఆ వీడియోను చూసిన అభిమానులు అప్ప‌టి కుంబ్లే బౌలింగ్‌ను గుర్తు తెచ్చుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version