Health Insurance : ఏ వయసు వరకూ ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవచ్చు..?

-

Health Insurance : జీవిత బీమా ప్రతి ఒక్కరికి ఉండాలి.. కుటుంబంలో సంపాదించే వారికి ఏదైనా అయితే ఆ కుటుంబం మొత్తం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అందుకే చాలా మంది లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆ ఆరోగ్య బీమా నిబంధనలను మార్చింది. IRDAI ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడానికి వయోపరిమితిని తొలగించింది. ఇక నుంచి ఏ వయసు వారైనా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి కొత్త చట్టం అమల్లోకి వచ్చింది.

నిబంధనలలో సవరణలు వినియోగదారులకు ప్రయోజనాలను పెంచే లక్ష్యంతో ఉన్నాయి. ఇంతకు ముందు 65 ఏళ్లు పైబడిన వారు మాత్రమే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ వయోపరిమితిని తీసివేయడంతో ఏ వయసు వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని వయసుల వారికి ఆరోగ్య బీమా పాలసీలను అందించడానికి కంపెనీలు కట్టుబడి ఉన్నాయని IRDA నోటిఫికేషన్ పేర్కొంది. అలాంటి వారి కోసం బీమా కంపెనీలు ప్రత్యేక పాలసీలను రూపొందించవచ్చు.

ఆరోగ్య బీమా వెయిటింగ్ పీరియడ్‌ను 48 నెలల నుంచి 36 నెలలకు తగ్గించాలని కూడా అథారిటీ ప్రతిపాదించింది. అంతేకాదు, 36 నెలల తర్వాత, పాలసీ తీసుకునే సమయంలో అనారోగ్యానికి కూడా బీమా వర్తిస్తుంది. ముందుగా ఉన్న వ్యాధి కారణంగా కంపెనీ ఈ వ్యవధి తర్వాత దావాను తిరస్కరించదు. IRDA జారీ చేసిన నోటిఫికేషన్‌లో క్యాన్సర్, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధి, ఎయిడ్స్‌తో బాధపడుతున్న వ్యక్తులకు బీమా కంపెనీలు పాలసీలను అందించడాన్ని నిలిపివేయలేవని కూడా పేర్కొంది.

ఇప్పుడు ఎన్నో కంపెనీలను ఆరోగ్య బీమా పాలసీలను అందిస్తున్నాయి.. ప్రీమియంను బట్టి మనకు వచ్చే బెనిఫిట్స్‌లో తేడా ఉంటాయి. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా ఇన్సూరెన్స్ ప్లాన్, సీనియర్ సిటిజన్స్ రెడ్ కార్పెట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, స్టార్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ, స్టార్ ఉమెన్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ, సూపర్ మిగులు బీమా పాలసీ, స్టార్ హెల్త్ గెయిన్ ఇన్సూరెన్స్ పాలసీ, స్టార్ మైక్రో రూరల్ మరియు ఫార్మర్స్ కేర్, స్టార్ హాస్పిటల్ క్యాష్ ఇన్సూరెన్స్ పాలసీ, యంగ్ స్టార్ ఇన్సూరెన్స్ పాలసీ, ఆరోగ్య సంజీవని పాలసీ, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్, స్టార్ హెల్త్ అష్యూర్ ఇన్సూరెన్స్ పాలసీ, డయాబెటిస్ సేఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇలా ఎన్నో రకాల ఇన్యూరెన్స్‌ పాలసీలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version