ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘రాజా సాబ్’ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

-

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం కల్కి మూవీ సక్సెస్ జోష్లో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేతిలో అరడజనుకుపైగా చిత్రాలున్నాయి. ఓవైపు కల్కి పార్ట్-2, సలార్ – పార్ట్-2. స్పిరిట్లతో పాటు దర్శకుడు మారుతితో కలిసి తీస్తున్న రాజాసాబ్ కూడా ఉంది. ఈ చిత్రాల నుంచి ఇప్పటి వరకు ఏ అప్డేట్ రాలేదు కానీ.. రాజా సాబ్ నుంచి మాత్రం తరచూ ఓ అప్డేట్ వదులుతున్నారు మేకర్స్.

తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ రాజా సాబ్ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రేపు (జులై 29వ తేదీ 2024) సాయంత్రం 5.03 గంట‌లకు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version