భారతదేశంలో కేవలం నిరుద్యోగత శాతం ఎక్కువ అవడం వలనే అభివృద్ధి ఎక్కువగా కనిపించడం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం పేద మరియు మధ్య తరగతి ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ వస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగత తగ్గించడానికి మరియు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఎంతో పనిచేస్తుంది. కాకపోతే ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం వలన కేంద్రం అందించేటువంటి పథకాలను సరైన తీరులో ఉపయోగించుకోవడం లేదు. అయితే నిరుద్యోగత తగ్గించడానికి మరియు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంఈజీపి ( ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జెనరేషన్ ప్రోగ్రామ్ ) అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా నిరుద్యోగ యువతకు ఆర్ధిక సహాయాన్ని అందజేస్తోంది. అయితే ఈ రుణం 50 లక్షల వరకు ఉంటుంది మరియు ఈ పథకంలో భాగంగా రుణంతో పాటుగా రాయితీని కూడా అందిస్తారు.
అర్హత వివరాలు:
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు కనీసం 18 ఏళ్ళ వయసు ఉండాలి మరియు కనీసం 8వ తరగతి వరకు చదువుకోవాలి. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జెనరేషన్ ప్రోగ్రామ్ పథకానికి కేవలం ఒక కుటుంబం నుండి ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడం కోసం అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ను తీసుకోవచ్చు. ఒకవేళ మీరు గ్రామీణ ప్రాంతానికి చెందినట్లయితే కేవిఐసి ను ఎంపిక చేసుకోవాలి మరియు పట్టణ ప్రాంతానికి సంబంధించిన వారు డిఐసి ను ఎంపిక చేసుకోవాలి. వెబ్సైట్ లో అడిగిన వివరాలను నింపి రిజిస్టర్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ను అందించడం జరుగుతుంది. అయితే వీటిని ఎంటర్ చేసి ఆన్లైన్ లో దరఖాస్తుకు సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసిన తర్వాత, పది నుండి పదిహేను రోజుల్లో రుణానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తారు. దీని తర్వాత మీ ప్రాజెక్టుకు సంబంధించి ఆన్లైన్ లేక ఆఫ్లైన్ లో శిక్షణను కూడా అందించడం జరుగుతుంది. ఎప్పుడైతే శిక్షణ పూర్తి అవుతుందో మొదటి వాయిదాలో రుణాన్ని అందిస్తారు మరియు రుణాన్ని పొందిన తర్వాత వరుసగా మూడేళ్ల పాటు తప్పకుండా వాయిదాలను చెల్లించాలి. ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లయితే సబ్సిడీని కూడా అందించడం జరుగుతుంది.