ఫ్రీగా రూ.5 లక్షల బీమా.. ఆయుష్మాన్ భారత్‌ స్కీముతో వేటికి కవరేజీ లభిస్తుంది..? పూర్తి వివరాలు ఇవే..!

-

ఆరోగ్య బీమా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఉచితంగా ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ని కల్పిస్తోంది. 70 ఏళ్ల వయసు దాటిన వారికి ప్రత్యేకంగా ఐదు లక్షల కవరేజీ ఇస్తున్నట్లు కేంద్రం చెప్పింది. ఇప్పుడే ఇంకొక కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఈ పథకం పరిధిలోకి ఆల్జీమర్స్, డిమెన్షియా, హార్ట్ ఫెయిల్యూర్ ఇలాంటి సమస్యలకు ప్రధానంగా వృద్ధులని వేధించే సమస్యలను చేర్చడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వృద్ధులకు సంపూర్ణ ఆరోగ్య బీమా కల్పించేందుకు 25 హెల్త్ ప్యాకేజీలని తీసుకువచ్చింది.

నేషనల్ హెల్త్ అథారిటీ వృద్ధాప్య సంరక్షణ లేదా వృద్ధాప్య సంబంధిత వ్యాధులకు ప్రత్యేకంగా ఉండే ప్యాకేజీలని జోడించే దిశగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 70 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు గల సీనియర్ సిటిజనులను చేర్చడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని విస్తరిస్తోంది. పెద్దలు ఎదుర్కొనే సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది ప్రధానంగా ఆసుపత్రిలో చేరినప్పుడు కావాల్సిన వాటికి ఎంపిక చేయనుంది.

రిజిస్ట్రేషన్ చార్జీలు, బెడ్ చార్జీలు, నర్సింగ్ బోర్డింగ్ ఛార్జీలు, సర్జన్స్, అనెస్థీషియన్లు, మెడికల్ ప్రాక్టీషనర్లు, కన్సల్టెంట్స్ ఛార్జీలు, అనెస్థీషియా, బ్లడ్ ట్రాన్స్‌ఫుజన్, ఆక్సిజన్, ఓటీ ఛార్జీలు, సర్జికల్ అప్లియన్స్ ఛార్జీలుతో పాటు మెడిసన్స్, డ్రగ్స్, ప్రొస్తెటిక్ డివైజులు, ఇంప్లాంట్స్ ఛార్జీలు, పాథోలజీ, రెడియోలజీ టెస్టులు, రోగులకు ఫుడ్, ఆసుపత్రిలో చేరక ముందు, చేరిన తర్వాతి ఖర్చులు. కన్సల్టేషన్, రోగ నిర్దరణ టెస్టులుతో పాటు 15 రోజుల వరకు మెడిసన్ ఖర్చులు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version