దేవాలయాల్లో పవిత్రతను కాపాడుకోవాలి : సీఎం చంద్రబాబు

-

బెజవాడ కనకదుర్గమ్మకు ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ లతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. మూల నక్షత్రం రోజు అమ్మవారిని దర్శించుకోవడం సంతోషకరమన్నారు. ఇవాళ భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పించారు. వచ్చిన ప్రతీ ఒక్కరికీ ఒక లడ్డూ ఉచితంగా అందజేస్తున్నట్టు తెలిపారు.

రాష్ట్రంలో మనం చూస్తే.. తిరుపతి వేంకటేశ్వరస్వామి దేవాలయం తరువాత రెండో టెంపుల్ గా విజయవాడ కనకదుర్గా టెంపుల్ ఉంది. ఒకసారి దుర్గమ్మను తలుచుకొని పూజలు చేస్తే.. దుష్ట శక్తులు ఏవి వచ్చినా దుర్గమ్మ తల్లి చూసుకుంటుందని మనందరం ముందుకు వెళ్తున్నాం. దేవాలయం పవిత్రతను కాపాడుకోవాలి. పాలక మండలి, కొత్తగా సేవా మండలిని ఏర్పాటు చేశాం. ఉత్సవ కమిటీ కాకుండా సేవా కమిటీ ద్వారా సభ్యులు ఈ దేవస్థానంలో సేవలు చేసే కార్యక్రమం చేపట్టాం. దేవాలయానికి వచ్చే ప్రతీ వ్యక్తికి భక్తి ఉంటేనే ఇక్కడికి రావాలి. సేవ చేసే పరిస్థితి ఉండాలి. భక్తుల నుంచి ఎప్పటికప్పుడూ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. క్యూ లైన్ లో 85, టెంపుల్ డెకరేషన్ 90 శాతం, అన్న ప్రసాదం 94 శాతం, ఉభయ దాతల సేవా కార్యక్రమం 94, లడ్డు ప్రసాదం 93, కేశఖండన 94 శాతం బాగుందని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అమ్మ దయ వల్ల ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ కొనసాగించాలన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version