రైతుల కోసం కేంద్రం చాలా స్కీమ్స్ ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్స్ వలన రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన స్కీమ్స్ లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కూడా ఒకటి. ఈ స్కీమ్ వలన రైతులకి చక్కటి లాభాలు కలుగుతాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటకు నష్టం వాటిల్లితే రైతులకు పంట బీమా ఇస్తారు.
ఈ పథకం కింద, రబీ పంటకు బీమా చేయడానికి వ్యవధి 31 డిసెంబర్ 2021గా నిర్ణయించారు. ఆ తరవాత చేస్తే ఉపయోగం ఏమి లేదు. పథకం ప్రయోజనాన్ని పొందడానికి ఇదే చివరి తేదీ కనుక ఈలోగా పెట్టాలి. 2020-21, 2021-22 , 2022-23 ఆర్థిక సంవత్సరాలకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలు కోసం మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి.
ఎంత ప్రీమియం చెల్లించాలి..?
ప్రకృతి వైపరీత్యాలు , నివారించలేని ఇతర ప్రమాదాలకు వ్యతిరేకంగా నోటిఫై చేయబడిన పంటలకు పంట బీమా అందుతుంది. తప్పక రైతులు భారత ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ప్రధాన రబీ పంటలలో గోధుమలు, బార్లీ, కందులు, ఆవాలు, బంగాళదుంపలకు 5 శాతం ప్రీమియం రేట్లు నిర్ణయించారు.
రైతులకి పంట నష్టం కలిగితే ఏం చెయ్యాలి..?
పంట నష్టం కనుక కలిగితే రైతులు 72 గంటల్లోగా అమలు చేసే ఏజెన్సీ/సంబంధిత బ్యాంకు శాఖ , వ్యవసాయం , సంబంధిత శాఖకు వివరాలు తెలపాలి. టోల్ ఫ్రీ నంబర్ 1800-889-6868ని కూడా సంప్రదించవచ్చు. డిఫాల్టర్ రైతులు కూడా పంట బీమా పొందవచ్చని వివరించండి. వారి బీమా కూడా 1.5 శాతం ప్రీమియంలో మాత్రమే ఉంటుంది. రైతులు ప్రీమియంగా చెల్లించిన ప్రతి రూ.100కి రికార్డు స్థాయిలో రూ.537 క్లెయిమ్‌ను పొందొచ్చు.