సెంట్రల్ సెక్టార్ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీం కి అప్లై చేయాలా? అర్హత వివరాలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి..!

-

విద్యార్థులు మంచి విద్యను పొందడం వలన దేశ అభివృద్ధి జరుగుతుంది. ఈ మధ్యకాలంలో స్కూల్, కాలేజీ ఫీజులు ఎంతో ఎక్కువ అయ్యాయి. దీంతో ఉన్నత చదువులకు మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎటువంటి ఆర్థిక సహాయం లేకపోవడం వలన మరియు స్తోమత లేకపోవడం వలన చాలా శాతం మంది తల్లితండ్రులు అప్పులు చేస్తున్నారు మరియు పూర్తి విద్యను అందించడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులు ఏర్పడడం వలన కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాల ద్వారా చదువుకునే వారికి రుణాలను అందిస్తోంది. అయితే దానిలో భాగంగా సెంట్రల్ సెక్టార్ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీం ను ప్రవేశపెట్టడం జరిగింది.

ఈ పథకంలో భాగంగా కేవలం రుణాన్ని అందించడంతో పాటుగా కొంత శాతం సబ్సిడీని కూడా అందిస్తోంది. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించాలి అని అనుకునేవారికి ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ప్రొఫెషనల్ లేక టెక్నికల్ కోర్సులను అభ్యసించడానికి ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని పొందవచ్చు.

అర్హత వివరాలు:

సెంట్రల్ సెక్టార్ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీం కు దరఖాస్తు చేసుకునే వారి కుటుంబ వార్షిక ఆదాయం 4.5 లక్షల లోపు ఉండాలి మరియు నాక్, ఎన్బీఏ, సీఎఫ్టీఐ వంటి సంస్థలు ఆమోదించి పొందిన కాలేజీల్లో మాత్రమే చదువుకుంటూ ఉండాలి. ఒకవేళ అండర్ గ్రాడ్యుయేట్ లేక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సు కు పథకాన్ని ఉపయోగించాలంటే కేవలం ఒకసారి మాత్రమే ఉపయోగించవచ్చు మరియు గ్రాడ్యుయేట్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వంటి ఇంటిగ్రేటెడ్ కోర్సులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది, ఒకవేళ ఇతర కేంద్ర లేక రాష్ట్ర ప్రభుత్వాల స్కాలర్షిప్ లేక ఫీజు రియంబర్స్మెంట్ పొందుతున్న విద్యార్థులు అయినా సరే ఈ పథకం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు.

అప్లై చేసే విధానం:

  • ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ ను సంప్రదించి స్టూడెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి, అక్కడ అడిగిన వివరాలను పూరించిన తర్వాత మీ అర్హతను చెక్ చేసుకోవాలి.
  • దీని తర్వాత మొబైల్ నెంబర్, క్యాప్చ ఎంటర్ చేసి నిబంధనలకు అంగీకరించాలి.
  • అంగీకరణ ఇచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ ను అక్కడ అందించాలి.
  • ఈ విధంగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది. చివరగా మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలను సమర్పించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

ఒకవేళ మీరు కనుక అర్హులు అయితే మీరు రుణానికి అర్హులు అని మీ ఫోన్ నెంబర్ కు మెసేజ్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version