కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అన్ని రంగాలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి చెందిన వారికి ఆర్థిక సహాయం ఎంతో అవసరం. రైతులు అభివృద్ధి కోసం మరియు వారికి సహాయాన్ని అందించేందుకు వ్యవసాయ పనిముట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందిస్తోంది. అదే ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన. ఈ పథకం ద్వారా రైతులు పనిముట్లకు సంబంధించి రాయితీని పొందవచ్చు. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన పథకంలో భాగంగా తక్కువ నీటిని ఉపయోగించి ఎక్కువ పంటలు పండించే విధంగా బిందు సేద్యం మరియు స్పిన్క్లర్ల వినియోగతను పెంచడానికి కృషి చేస్తోంది. ఈ విధంగా పంటలు పండించిన రైతులకు 55% వరకు రాయితీని ఇస్తోంది.
అర్హత వివరాలు:
ప్రధానమంత్రి కిసాన్ సంచాయి యోజన పథకంలో భాగంగా ప్రయోజనాలు పొందాలంటే భూమిని వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించాలి మరియు రైతులు కచ్చితంగా భారతీయ పౌరులు అయి ఉండాలి. అంతేకాకుండా రెండు హెక్టార్ల వరకు భూమి ఉండేటువంటి చిన్న రైతులు మాత్రమే అర్హులు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, కోఆపరేటివ్ సొసైటీ వంటి ఇతర విభాగాలకు చెందిన రైతులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునే విధానం:
ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు పత్రాన్ని అధికారిక వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. ఈ ప్రక్రియకు భూమికి సంబంధించిన పాస్ బుక్, బ్యాంక్ పాస్ బుక్, ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం వంటి ఇతర డాక్యుమెంట్లు ఉపయోగించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. పూర్తి అయిన తర్వాత అర్హులు అయిన రైతులకు సబ్సిడీ వంటి ప్రయోజనాలను పొందవచ్చు.