రూ.200 పొదుపుతో.. రూ.28 లక్షల వరకు పొందొచ్చు..!

-

మీరు మీ డబ్బుల్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి మంచి రాబడి పొందాలని అనుకుంటున్నారా..? అయితే లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే అదిరే లాభాలని పొందొచ్చు. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) గత కొన్ని నెలల నుంచి అనేక రకాల కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ఉంది. వీటి వలన ఎన్నో లాభాలని పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..

LIC

ఎల్ఐసీ అనేక కొత్త పాలసీలను తీసుకొస్తోంది. అందులో జీవన్ ప్రగతి పాలసీ కూడా ఒకటి. దీనిలో ఇన్వెస్ట్ చెయ్యడం వలన ప్రతీ నెల పెట్టుబడి పెట్టి మెచ్యూరిటీ తర్వాత పెద్ద మొత్తంలో రిటర్న్స్ వస్తాయి. అలానే పెట్టుబడిదారులకు మరణ బీమా ప్రయోజనాలను కూడా ఉంటుంది. ఈ పాలసీలో పెట్టుబడులు పెట్టాలంటే గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలు వరకు ఉంది. ఈ పాలసీ కింద గరిష్ట ప్రయోజనాలను పొందడానికి పెట్టుబడిదారులు కనీసం 12 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే మంచిది.

ఈ స్కీమ్ కింద మెచ్యూరిటీ సమయంలో రూ.28 లక్షలు పొందాలంటే పెట్టుబడిదారులు ప్రతి నెలా సుమారు రూ.6000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే రోజుకి రెండు వందలు ఈ స్కీమ్ లో పెట్టాలి. అలా రూ.20 ఏళ్లు పెడితే… మొత్తం పెట్టిన పెట్టుబడి సుమారు రూ.15 లక్షల దాకా అవుతుంది. దానికి రిటర్న్ రూ.28 లక్షలు వస్తుంది.

అంతే కాదు… రూ.15,000 పెన్షన్ కూడా పొందొచ్చు. ఇలా మొత్తం రూ.29 లక్షలకు పైనే వస్తుంది. ఒకవేళ కనుక పెట్టుబడిదారుడు మరణించినట్లయితే ఆ మొత్తంను నామినీ ఖాతాకు క్రెడిట్ చేస్తారు. పాలసీ తీసుకున్న తర్వాత ఐదు సంవత్సరాల్లోపు పెట్టుబడిదారుడు మరణించినట్లయితే నామినీ ప్రాథమిక మొత్తంలో 100% బీమా పొందుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version