SBI: ఈ లావాదేవీలను కొనసాగించాలనుకుంటే ఇలా చెయ్యాల్సిందే..!

-

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో సేవలని అందిస్తోంది. అయితే ఇప్పుడు ఖాతాదారులను అలర్ట్ చేసింది. అదేమిటంటే…? అంతర్జాతీయ లావాదేవీలను కొనసాగించాలనుకుంటే తప్పకుండ మీ బ్యాంకు ఖాతాతో మీ పాన్(PAN) నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ఈ విషయాన్ని స్వయంగా ఎస్‌బీఐ తెలిపింది. ఇలా చెయ్యకపోతే అంతర్జాతీయ లావాదేవీలను చేసేటప్పుడు అంతరాయం కలగొచ్చు. మీరు కనుక మీ బ్యాంకు ఖాతాతో మీ పాన్(PAN) నంబర్‌ను లింక్ చేసుకోవాలి అంటే బ్యాంక్ కి వెళ్ళక్కర్లేదు. కేవలం ఇంట్లోనో, ఆఫీసు లోను కూర్చుని సులువుగా చేసేసుకోవచ్చు.

అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా లేక విదేశాలలో ఎస్‌బీఐ ఏటీఎం కార్డు వినియోగించాలన్నా కూడా PAN కార్డును తప్పక లింక్ చేసుకోవాలని SBI అంది. అకౌంట్‌కు పాన్ కార్డ్ రిజిస్టర్ చెయ్యాలంటే…? ముందుగా ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ https://www.onlinesbi.com/కు లాగిన్ అవ్వండి, ఈ-సర్వీస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు పాన్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ క్లిక్ చేయండి. పాస్‌వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

తర్వాత మీ అకౌంట్ వివరాలు కనపడతాయి. ‘Click here to register’ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఏ అకౌంట్‌కు పాన్(PAN) లింక్ చేయాలో దానిని క్లిక్ చేసాక పాన్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేసి, సబ్మిట్ చెయ్యండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద మీ పేరు, CIF మరియు పాన్ నంబర్ కనిపిస్తాయి. వివరాలు చెక్ చేసి కన్ఫార్మ్ చెయ్యండి. వెరిఫికేషన్ కోసం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు హై సెక్యూరిటీ కోడ్ అందుతుంది. దాన్ని ఎంటర్ చేసి కన్ఫార్మ్ ఆప్షన్‌ క్లిక్ చెయ్యండి. స్క్రీన్‌పై మీ రిక్వెస్ట్‌కు సంబంధించిన వివరాలు ఉంటాయి. బ్యాంక్ మీ రిక్వెస్ట్‌ను 7 రోజుల్లో ప్రాసెస్ చేస్తుంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version