వాట్సాప్‌ చాట్‌ బ్యాకప్‌ ఇలా చేయండి..

-

సాధారణంగా మనం కొత్త ఫోన్‌ కొనుక్కుంటే పాత ఫోన్‌లోని వాట్సాప్‌ ఛాట్‌ అలాగే ఉండిపోతుంది. అయితే, కొత్త ఫోన్‌లోకి పాత వాట్సాప్‌ ఛాట్‌ ఎలా బ్యాకప్‌ చేసుకోవాలో తెలుసుకుందాం. వాట్సాప్‌ ఇటీవల తెచ్చిన నూతన ప్రైవసీ విధానం వివాదాస్పదం అయినా సంగతి తెలిసిందే, అయినప్పటికీ వాట్సాప్‌ నంబర్‌ 1 చాటింగ్‌ యాప్‌గా కొనసాగుతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు,అందరూ వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. మెసేజ్‌ చేయడానికి, ఫోటోలు, వీడియోలు, వాయిస్, వీడియో కాల్స్‌ చేయడానికి వాట్సాప్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఫోన్‌ మార్చినప్పుడు లేదా ఫోన్‌ పోగొట్టుకున్నప్పుడు అందులోని విలువైన డేటా పోతుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు వాట్సాప్‌ బ్యాకప్‌ అనే ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో మీ డేటాను సురక్షితంగా ఉంచుకోవడంతో పాటు ఫోన్‌ డేటా బ్యాకప్‌ను చేసుకోవచ్చు.


వాట్సాప్‌ చాట్‌ను బ్యాకప్‌ కోసం ఈ స్టెప్స్‌ ఫాలో అవ్వండి

 

  • మీ ఫోన్‌లోని వాట్సాప్‌ యాప్‌ ఓపెన్‌ చేయండి. స్క్రీన్‌ కుడి ఎగువ మూలలో ఉన్న సెట్టింగ్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • ‘చాట్స్‌’ ను సెలెక్ట్‌ చేసుకుని ‘చాట్‌ బ్యాకప్‌’లోకి వెళ్లండి. గూగుల్‌ చాట్‌లో మీ చాటింగ్‌ మొత్తాన్ని బ్యాకప్‌ చేయడానికి ‘చాట్‌ బ్యాకప్‌’ ఆప్షన్‌ మిమ్మల్ని అనుమతిస్తుంది.
  • మీ చాట్‌ను బ్యాకప్‌ చేయాలనుకుంటున్న గూగుల్‌ అకౌంట్‌ను ఎంచుకోండి. అలాగే మీకు ఇష్టమైన మోడ్‌ను ఎంచుకోండి. వీటిలో మీకు వైఫై లేదా సెల్యులార్‌ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి.
  • మీరు వాట్సాప్‌లో పంచుకున్న వీడియోలను బ్యాకప్‌ చేయాలనుకుంటే ‘ఇంక్లూడ్‌ వీడియోస్‌’ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోండి.
  • మీ గూగుల్‌ డిస్క్‌ సెట్టింగులన్నింటినీ పూర్తి చేసిన తర్వాత గ్రీన్‌ కలర్‌లో ఉన్న ‘బ్యాకప్‌’ ఐకాన్‌పై క్లిక్‌ చేయండి. ఇది మీరు ఎంచుకున్న గూగుల్‌ డిస్క్‌ అకౌంట్‌లోకి మీ మెసేజెన్‌ అన్నింటినీ అప్‌లోడ్‌ చేస్తుంది.

కొత్త ఫోన్‌లో వాట్సప్‌ చాట్‌ బ్యాకప్‌ ..

  • వాట్సాప్‌ కొత్త వెర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఇన్‌ స్టాలేషన్‌ పూర్తయిన తర్వాత, మీ డివైజ్‌లో కాంటాక్ట్స్‌, ఫోటోలు, మీడియాలు, ఫైల్స్‌ను యాక్సెస్‌ చేయడానికి అనుమతివ్వండి. అయితే, చాట్‌ బ్యాకప్‌ కోసం లేటెస్ట్‌ వెర్షన్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవడం మర్చిపోవద్దు.
  • ఆ తర్వాత మీ ఫోన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి వెరిఫికేషన్‌ పూర్తి చేయండి. ఆ తర్వాత మీరు మీ ఫోన్‌ లో 6– అంకెల వెరిఫికేషన్‌ కోడ్‌ పొందుతారు. అది ఆటోమేటిక్‌గా వెరిఫికేషన్‌ పూర్తవుతుంది.
  • వాట్సాప్‌  వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత, ‘రీస్టోర్‌ బ్యాకప్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. ఫలితంగా గూగుల్‌ క్లౌడ్‌లోని మీ వాట్సాప్‌ మెసేజెస్‌ పునరుద్ధరించబడతాయి.
  • ‘నెక్ట్స్‌’పై క్లిక్‌ చేయండి. ఆ తర్వాత ‘ప్రొఫైల్‌ ఇన్ఫో’ విండో ఓపెన్‌ అవుతుంది. దానిలో మీ పేరును టైప్‌ చేయండి.
  • మీ పాత వాట్సాప్‌ డేటా బ్యాకప్‌ అవ్వడానికి కొన్ని సెకన్ల సమయం పడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version