భారత్ లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లు ఇవే…!

-

క్యాన్సర్’ ప్రపంచ యుద్ధం కన్నా ఎక్కువ మందిని బలితీసుకున్న వ్యాధి ఇది. ఇది వచ్చింది అంటే తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఎందరో దీని కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మన జీవన శైలి, వారసత్వం కారణంగా ఈ వ్యాధి సంక్రమిస్తూ ఉంటుంది. అయితే ప్రజల్లో దీనిపై అవగాహన లేకపోవడం కూడా క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఇక మన దేశంలో ఎక్కువగా వచ్చే కేన్సర్లను చూస్తే, ఊపిరితిత్తులు, , రొమ్ము, గర్భాశయ మరియు పెద్దప్రేగు క్యాన్సర్‌లు మన దేశంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటికి వేరు వేరు లక్షణాలు ఉన్నాయి. వీటిని ముందస్తుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. 55 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారిలో కేన్సర్, 40 ఏళ్ళ వయసు కంటే తక్కువ ఉన్న వారిలో కేన్సర్ అనేది తేడాగా ఉంటుందట.

“భారతదేశంలో మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణ రకం మరియు గర్భాశయ క్యాన్సర్ మహిళల్లో మరణానికి ప్రధాన కారణం” అని వైద్యులు అంటున్నారు. కేన్సర్ ని పరిష్కరించుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయని అంటున్నారు. 1) ప్రజలు వారి జీవనశైలి అలవాట్లపై మరింత స్పృహ కలిగి ఉండాలి 2) మంచి ఆహారాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది.

“అదే సమయంలో, HPV టీకా లేదా సాధారణ ఆరోగ్య పరీక్షల ద్వారా క్యాన్సర్ నివారణ మరియు ముందస్తుగా గుర్తించడాన్ని ప్రోత్సహించడానికి స్థిరమైన మరియు పెద్ద ఎత్తున ప్రయత్నాలు ఉండాలని వైద్యులు అంటున్నారు. హానికరమైన సూర్యుడి UV కిరణాలకు అధికంగా గురికాకుండా ఉండడం మరియు పొగాకు ఉత్పత్తుల విషయంలో నిషేధం ఉండటం వంటివి చాలా అవసరమని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version