ఈ అలవాట్ల వల్లే టైం వేస్ట్ అవుతోంది…మానుకోండి..!

-

చాలామంది కొన్ని కొన్ని అలవాట్లతో సమయాన్ని వృధా చేసుకుంటారు. మీ సమయం కూడా వీటి వల్ల వృధా అయిపోతుందేమో చూసుకోండి.. చాలామంది జీవితంలో మంచి పొజిషన్ లోకి రావాలని అనుకుంటూ ఉంటారు కానీ కొన్ని అలవాట్ల వల్ల సమయం వృధా అవుతూ ఉంటుంది దాంతో అనుకున్న పనులు సరైన టైం కి పూర్తి చేయరు. సక్సెస్ ని కూడా అందుకోలేకపోతుంటారు.

చాలామంది ఎక్కువ సేపు నిద్రపోతూ ఉంటారు బాగా ఎక్కువ నిద్రపోయినట్లయితే సమయం వృధా అవుతుంది. ఎక్కువసేపు నిద్రపోవడం వలన నిద్ర లోనే టైం అంతా గడిచిపోతుంది అనుకున్న పనులు పూర్తి చేసేడానికి సమయం ఉండదు.
నిద్ర లేవగానే చాలామంది ఫోన్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు సమయం తెలియకుండా గడిచిపోతూ ఉంటుంది ఫోన్ పట్టుకోకుండా అనుకున్న పనులు పూర్తి చేయడానికి ఏకగ్రత పెట్టాలి. అలానే ఎక్కువ ఫోన్ కాల్స్, చాటింగ్ వలన కూడా టైం వేస్ట్ అవుతుంది. ఇలా కనుక మనం ఫోకస్ చేస్తే కచ్చితంగా సమయం వృధా చేసుకోకుండా ఉండగలము.
చాలామంది ఎక్కువ శ్రమ పడాలని ప్రాసెస్డ్ ఫుడ్ ని తీసుకుంటున్నారు కానీ నిజానికి ఇలాంటి ఫుడ్ ని తీసుకోవడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది ఉన్నచోటే కూర్చోవడం వలన శరీరం బద్దకంగా మారిపోతుంది. మెదడు పనితీరు మందగిస్తుంది కాబట్టి రోజూ మీ ప్లాన్ లో ఒక పని ఉండేటట్టు చూసుకోండి అలా కూర్చోకండి.
చాలామంది సీరియస్ గా కోపంతో ఉంటూ ఉంటారు అయితే కోపంతో ఉంటూ ఆస్తమాను దాని మీదే ఫోకస్ పెట్టడం వలన సమయం వేస్ట్ అవుతుంది.
స్మోకింగ్ డ్రింకింగ్ వలన కూడా సమయం వృధా అవుతుంది పైగా మనం అనుకున్న దాని మీద ఏకాగ్రత పెట్టడం కూడా అవ్వదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version